చర్మంపై ముడతలు తగ్గాలంటే ఇలా చెయ్యండి..

Purushottham Vinay
చర్మంపై ముడతలు తగ్గాలంటే పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. పుచ్చ కాయలో దాదాపు 90 శాతం నీరు అనేది ఉంటుంది. అందువల్ల పుచ్చకాయ మీ చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఇంకా మృదువుగా చేస్తుంది.ఇక మీ చర్మాన్ని ఎల్లప్పుడూ మెరిసేలా చేయడానికి ఒక గిన్నెలో సమాన పరిమాణంలో పుచ్చకాయ రసం ఇంకా తేనె అలాగే పచ్చి పాలు తీసుకోండి. వీటిని బాగా కలిపి మీ ముఖం ఇంకా మెడపై అప్లై చేసి ఒక 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో  కడుక్కొని బాగా శుభ్రం చేసుకోండి.ఇంకా నిమ్మరసంతో పాటు పుచ్చకాయ రసాన్ని కూడా ఉపయోగించి ముఖానికి ఎక్స్‌ఫోలియేటింగ్ మాస్క్ ని తయారు చేయండి. దీన్ని మీ చర్మంపై సమానంగా అప్లై చేసి  ఒక 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయండి.అలాగే మీ చర్మాన్ని బాగా మెరుగుపరచడానికి, పుచ్చకాయ అలాగే దోసకాయ గుజ్జును సమాన పరిమాణంలో తీసుకోండి. అలా తీసుకోని ఫేస్ కి ఓ చక్కటి మాస్క్ ని తయారు చేసుకోండి. ఇక ఈ మాస్క్ ని మీ చర్మంపై అప్లై చేసి ఒక 15-20 నిమిషాల తర్వాత ముఖాన్ని బాగా శుభ్రంగా కడిగేయండి.

అలాగే బొప్పాయి కూడా ముడతలు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, బి, సి ఎంతో పుష్కలంగా ఉంటాయి.అంతేగాక ఇది జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఇంకా మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది.అలాగే బొప్పాయి మీ చర్మాన్ని బాగా తేమగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.కొద్దిగా పండిన బొప్పాయిని తీసుకొని ఒక గిన్నెలో వేసి అందులో అర టీస్పూన్ బాదం నూనెను మిక్స్ చేసి మీకు ముడతలు పడిన పొడి చర్మంపై బాగా అప్లై చేయండి. ఇలా మాయిశ్చరైజేషన్ చేసుకోని చక్కటి ఫలితం కోసం 10-15 నిమిషాల పాటు ఉంచుకొని ఆ తర్వాత కడిగేయండి.అలాగే పిగ్మెంటేషన్ సమస్యను కూడా తగ్గించడానికి పండిన బొప్పాయికి నిమ్మరసం ఇంకా చిటికెడు పసుపుని కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి బాగా ఆరిన తర్వాత శుభ్రంగా కడగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: