మెరిసే చర్మం కోసం అదిరిపోయే ఇంటి చిట్కాలు..

Purushottham Vinay
మెరిసే చర్మం కోసం టమాటాలు ఎంతగానో ఉపయోగపడతాయి.టమోటాలో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని బాగా మెరుగుపరుస్తుంది. టమోటా రసాన్ని తీసుకొని చర్మంలోని టాన్ ఉన్న ప్రదేశాలకు అప్లై చేసి బాగా మసాజ్ చెయ్యండి. ఒక 15 నిమిషాలు బాగా ఆరనిచ్చిన తర్వాత చల్లని నీటితో బాగా శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా వారానికి మూడుసార్లు చేయాలి.

అలాగే గ్రామ్ పిండి ఇంకా పసుపు మిశ్రమం కూడా చర్మం నుంచి టాన్ తొలగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. రెండు చెంచాల గ్రామ్ పిండిని తీసుకోని దానికి చిటికెడు పసుపు ఇంకా కొన్ని చుక్కల నిమ్మరసం అలాగే పాలని కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగండి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని ఎంతో కాంతివంతం చేయడమే కాకుండా మంచి యాంటీ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది.

అలాగే కొబ్బరి పాలలో ఉండే విటమిన్ సి ఇంకా తేలికపాటి ఆమ్లాలు మంచి డి-టానింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. తాజా కొబ్బరి పాలను తీసుకొని అందులో కాటన్ బాల్‌ను ముంచి టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చెయ్యండి. ఇక కొద్దిసేపు ఆరిన తర్వాత ముఖాన్ని కడగండి.అలాగే చర్మ నిగారింపు కోసం తేనె-బొప్పాయి ప్యాక్ చాలా మంచిది. ఎందుకంటే బొప్పాయిలో ఉండే పాపైన్ ఎంజైమ్ టాన్ ని తొలగించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

ఇక కొద్దిగా బొప్పాయి గుజ్జుకు తేనెను కలిపి మెత్తని పేస్ట్ లా చేయండి. ఆ మిశ్రమాన్ని ముఖం ఇంకా ఇతర చర్మంపై పూయండి. ఇక ఆరిన తర్వాత శుభ్రంగా కడగండి. ఇక చర్మానికి మంచి నిగారింపు అనేది ఉంటుంది.అలానే నిమ్మకాయ రాసానికి కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి బాగా అప్లై చేసి ఒక 15-20 నిమిషాలు ఆరనివ్వాలి. నిమ్మకాయ మంచి బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.ఇక ఇందులో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇక తేనె చర్మాన్ని మృదువుగా చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: