రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే అందమే అందం...

Purushottham Vinay
మన ముఖాన్ని బయట కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి రాత్రిళ్లు పడుకునే ముందు మనం తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలే మనకు అందాన్ని తెచ్చిపెడుతాయి. ఎందుకంటే మన శరీరంలో దెబ్బతిన్న కణాలను బాగు చేసే సమయం రాత్రి పూట మాత్రమే.రాత్రిపూట ఎలాంటి బ్యూటీ పద్దతులైనా బాగా పనిచేస్తాయట. మీ చర్మం దుమ్ము ఇంకా మలినాలు అలాగే వడదెబ్బతో పాడై పోయినప్పటికీ, ఫేస్లో చైతన్యం నింపే సమయం మాత్రం రాత్రేనటా. ఇది ప్రకాశవంతమైన ఇంకా అందమైన చర్మాన్ని అందిస్తుంది.మీరు మంచిగా నిద్రపోతే శరీరానికి అది మంచి బలం ఇస్తుంది. రాత్రిపూట మంచి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.ఇక ముఖం అందంగా మెరవాలంటే పగటిపూట అధిక మాయిశ్చరైజర్ చేసుకోవాలి.అలాగే రాత్రిపూట మాస్కుపెట్టుకోవడం చాలా మంచిది. మార్కెట్లో ఎన్నో రకాల స్లీపింగ్ మాస్క్లులు చాలా అందుబాటులో ఉన్నాయి. కానీ దీన్ని ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు మీ ముఖానికి క్రీమ్ రాసుకోండి.

ఈ క్రీమ్ చర్మాన్ని ఉపశమనం చేయడానికి అలాగే దానిలో చైతన్యం నింపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక రాత్రిపూట డ్రైవ్ క్యూటికల్స్ చికిత్స చేయడం అనేది చాలా అవసరం. మీకు నెయిల్ క్యూటికల్స్ ఉంటే, రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్ పదార్ధాన్ని వాడండి. పొడవైన జుట్టు ఉన్న ప్రతి స్త్రీ పడుకునే ముందు వాడండి.ఇంకా మీ జుట్టుకు ఆలివ్ ఆయిల్ లేదా మరేదైనా నూనె రాయడం మంచిది. ఇది జుట్టు చివరి దాకా కూడా మాయిశ్చరైజర్ని అందిస్తుంది. జుట్టు కొన ఇతర భాగం కంటే బాగా పొడిగా ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా ఫేస్ కి మాయిశ్చరైజర్‌ చెయ్యడం అనేది చాలా చాలా అవసరం.కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అనేవి ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తాయి.కాబట్టి మీరు రాత్రి పూట క్రీములు వాడి పడుకుంటే ఈ సమస్య ఉదయం నాటికి కనిపించదు. ఉంగరపు వేలితో కంటి కింద భాగాన్ని చాలా సున్నితంగా మసాజ్ చేయండి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: