వర్షాకాలంలో అందమైన ముఖం కోసం ఇలా చెయ్యండి..

Purushottham Vinay
వర్షా కాలంలో ముఖం అందంగా ఉండటానికి నిమ్మకాయ రసం ఎంతగానో సహాయపడుతుంది.నిమ్మకాయ రసంలో ఉన్న ఆస్కోర్బిక్ యాసిడ్ చర్మంపైన ఉన్న మృత‌ కణాలను అలాగే ట్యాన్‌ను శుభ్రంగా తొలిగించి ముఖాన్ని మిల మిల మెరిసేలా చేస్తుంది. అందుకోసం మనం బాగా ముగ్గిన నిమ్మకాయ ముక్కను తీసుకొని దానిలోని గింజలను తీసేయాలి. ఇక దాంతో ముఖంపైన శుభ్రంగా ఇంకా గుండ్రంగా బాగా రుద్దుకోవాలి. ఇలా ట్యాన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరింత ఎక్కువ సమయం పాటు రుద్దుకోవాలి. ఇలా బాగా రుద్దడం పూర్తయిన తర్వాత ఐదు నిమిషాలు అలా వదిలేసి ఆరబెట్టాలి.ఆ తరువాత నూనెతో ముఖాన్ని బాగా రెండు నిమిషాలు పాటు మర్దన చేసుకోవాలి. ఇలా ముఖాన్ని బాగా మర్దన చేసుకొంటున్నప్పుడు చర్మంపైన పేరుకొన్న మురికి అలాగే మృత‌ కణాలు ఇంకా మట్టి త్వరగా వదిలిపోతాయి. ఇక ఆ తర్వాత చర్మం పూర్తిగా శుభ్రం అయ్యి అది అందంగా మిల మిల మెరిసిపోతుంది.కాబట్టి నిమ్మకాయ రసాన్ని మొదటిసారిగా చర్మానికి రాసుకొంటున్నట్లయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరిగా చెయ్యాలి.ఇక గడ్డం దగ్గర కొద్దిగా నిమ్మకాయ రసం రాసుకోవాలి.ఇక కొన్ని నిమిషాల తర్వాత కూడా మీకు అంతగా ఏమీ ఇబ్బందిగా అనిపించకపోతే మీరు ఈ చిట్కాను తరచూ పాటించవచ్చు.

ఇక చర్మం పై మురికి అలాగే ట్యాన్ పోగొట్టుకోవడంతో పాటు చర్మాన్ని క్లెన్సింగ్ చేసుకోవడానికి టమాటా, ఎర్రకందిపప్పు ఇంకా కలబందతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వేసుకొంటే చాలా మంచి ఫలితం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది.ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పును తీసుకొని దాదాపు 20 నుంచి 30 నిమిషాల దాకా నానబెట్టాలి. బాగా నానిన కందిపప్పులో ఒక చెంచా టమాటా గుజ్జు ఇంకా కొద్దిగా కలబంద గుజ్జు కూడా కలిపి బ్లెండర్లో వేసి బాగా మెత్తటి గుజ్జుగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి బాగా అప్లై చేసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి.అలా ఆరిన  తర్వాత బాగా చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే మీ ముఖంపై ఉన్న ట్యాన్ ఈజీగా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: