వేపాకుతో ఆకట్టుకునే అందం మీ సొంతం...

Purushottham Vinay
ఇక వేపాకు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిన సంగతే. వేపాకులో ఎన్నో ఔషద గుణాలు వున్నాయి.ముఖ్యంగా వేప ఆకులు క్రీములను నాశనం చేస్తాయి.దీనిలో నొప్పి నివారణ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎన్నో పుష్కలంగా ఉన్నాయి.వేపాకు అనేది కేవలం ఆరోగ్యాన్ని పెంపొందించడానికే కాదు. అందాన్ని సంరక్షించేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా చర్మం, జుట్టుకు అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలను బాగా అందిస్తుంది. ఇక ఇందులో నింబిడిన్, నింబోలైడ్ , అజాడిరాచ్టిన్ వంటి రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి.ఈ రసాయనాలు చర్మం, జుట్టు సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి.. బయట దొరికే కృత్రిమ కాస్మోటిక్ రసాయనాలతో కాకుండా వేపాకుతో ఏ విధంగా మీ అందాన్ని పెంపొందించుకోవచ్చో తెలుసుకోండి.వేపలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడి మొటిమలను తగ్గిస్తాయి.వేప మొటిమల చికిత్స, నివారణకు ఎంతగానో సహాయపడుతుంది.వేప చర్మంలో జిడ్డు ఉత్పత్తిని నివరించేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేగాక వేపలో యాంటీ బాక్టీరియల్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
అంతేగాక వేప చర్మాన్ని సున్నితంగా ఉంచేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.వేప పొడి చర్మం నుంచి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది.వేపలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇంకా మాయిశ్చరైజింగ్ ట్రైగ్లిజరైడ్స్ అలాగే విటమిన్ E వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.వేపాకు చర్మంపై ఉండే ముడతలు, ముదురు మచ్చలను వేప తగ్గిస్తుంది.ఇంకా చర్మాన్ని ఎంతో బిగువుగా చేస్తుంది. వేపాకు ముఖం మీద ఏర్పడే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్‌ నివారణకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక వేపాకు చర్మంలోని మలినాలను బయటకు పంపి, రంధ్రాలను పూడ్చేందుకు ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది.ఇక వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి చుండ్రును ఎంతగానో నివారిస్తాయి.వేపాకు చుండ్రు వల్ల కలిగే దురద, మంట, చికాకు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: