మాస్క్ వల్ల వచ్చే యాక్నే సమస్యలు తగ్గాలంటే ఇలా చెయ్యండి....
ఇక ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలలో ఎండ వేడి ఎక్కువగా ఉండటం, ఇక అలాగే చెమట అనేది బాగా ఎక్కువైపోవడం, ఇంకా మాస్క్ ఫ్రిక్షన్ వల్ల యాక్నె సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని డాక్టర్ అన్నారు. ఇక అందుకని చర్మానికి మంచి స్పెషల్ కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం అని తెలిపారు. మాస్క్ వేసుకొని బయటకి వెళ్లి వచ్చిన తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.ఇక అలాగే రోజు కూడా ఒక పది నిమిషాల పాటు ఐస్ క్యూబ్స్ ని ముఖంపై పెట్టుకోవాలి. ఇక తప్పనిసరిగా మాస్కుని రోజు వేడి నీళ్లతో ఉతకాలి. మాస్క్ నీట్ గా లేకపోవడం వల్ల కూడా యాక్నే సమస్యలు వస్తాయి. కాబట్టి ఇక రోజు తప్పనిసరిగా శుభ్రంగా మాస్కుని ఉతుక్కోవాలి.ఇక అందువల్ల చర్మం చాలా తాజాగా మారి యాక్నే వంటి సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి.