సన్ స్క్రీన్ లోషన్ ను రోజుకు ఎన్ని సార్లు అప్లై చేయాలో తెలుసా..?

Divya

సాధారణంగా సన్ స్క్రీన్ లోషన్ మన చర్మానికి చాలా మంచిది. ఇంక స్కిన్ అడ్వైసర్ ఉన్నా కూడా మనకు సన్ స్క్రీన్ లోషన్ ను గురించి చెప్పరు. కానీ సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.. అయితే సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏమిటి..?ఎన్నిసార్లు దానిని మనం అప్లై చేసుకోవచ్చు..? ఇలా అనేక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సన్ స్క్రీన్ లోషన్ కేవలం మన చర్మాన్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా చర్మానికి చాలా మంచి చేస్తుంది. సాధారణంగా కఠినమైన ఎండ నుండి తప్పించుకోవడానికి ఈ సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేసుకుంటూ ఉంటాము . ప్రతి ఒక్కరూ దీన్ని తప్పకుండా రోటీన్ కేర్ లాగ ఉపయోగిస్తూ ఉండాలి. అయితే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలా
..?  లేదా బయటకు వెళ్లినప్పుడు మాత్రమే అప్లై చేయాలా..? అనే సందేహం కూడా చాలామందిలో ఉంటుంది..
సాధారణంగా సన్ స్క్రీన్ లోషన్ ను ప్రతి రెండు గంటలకు ఒకసారి అప్లై చేయవచ్చు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు అయినా సరే లేదా బయటకు వెళ్ళినప్పుడు అయినా సరే కంపల్సరిగా సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేయడం మాత్రం మర్చిపోకూడదు. దీనివల్ల చర్మం పాడైపోకుండా ఉంటుంది. పైగా హానికరమైన కిరణాలు ముఖానికి తాకకుండా ఉంటాయి..
అయితే ఈ సన్ స్క్రీన్ లోషన్ ను ఎందుకు రెండు సార్లు అప్లై చేయాలి అనే విషయానికి వస్తే, సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం వల్ల సూర్యకిరణాల వల్ల మనకు ఎటువంటి హానీ కలగకుండా చేస్తుంది. కానీ మనకు పట్టే చెమట మరియు నూనె వల్ల స్కిన్ పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ లోషన్ ను తప్పకుండా ఉపయోగించాలి.. ఇలా ప్రతి రెండు గంటల కొకసారి సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించడం వల్ల చర్మం అందంగా, తాజాగా ఉండడమే కాకుండా మచ్చల రహిత ముఖం మీ సొంతమవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: