పోలీస్ స్టేషన్ మెట్లేక్కిన టాలీవుడ్ హీరోయిన్.. వేధింపులే కారణమా..?
తన ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలకు సంబంధించి ఒకరు చాలా అసభ్యకరంగా అనైతికంగా కామెంట్స్ చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈషా రెబ్బ. ఆ కామెంట్స్ చేసిన వ్యక్తికి సంబంధించి ఇన్స్టా ఐడి, ఇతర వివరాలు అతను చేసిన కామెంట్స్ స్క్రీన్ షాట్లను కూడా ఫిర్యాదుతో జత చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు కూడా తెలుపుతూ హీరోయిన్ ఇచ్చిన కంప్లైంట్ పైన దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఈ విషయం తెలిసిన అభిమానులు, నెటిజెన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా మద్దతుగా నిలుస్తున్నారు ఈషా రెబ్బకు.
ఇటీవలే ఈషా రెబ్బ నటించిన ఓం శాంతి శాంతి శాంతిః చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. మలయాళ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా విడుదలైన జయ జయ జయ జయహే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ కి జోడిగా నటించింది ఈషా రెబ్బ. గత కొద్దిరోజులుగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.