బ్యూటీ : సోరియాసిస్ సమస్యతో బాధపడేవారు ఈ పద్ధతులు పాటించండి....

Purushottham Vinay
చాలా మంది సోరియాసిస్ సమస్యతో బాధ పడుతూ వుంటారు.తరచూ జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి లేమి లాంటి సమస్యల వల్ల చర్మ సంబంధ వ్యాధులు దరిచేరతాయని, ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరమేమీ లేదని.. తద్వారా సూక్ష్మజీవులు నేరుగా చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి అంటున్నారు.ఇక ఈ సమస్య రాకుండా చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ తగినంత నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. శరీరంపై ఒత్తిడి తగ్గించేందుకు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, ఉదయం పూట వాకింగ్, రన్నింగ్ లాంటివి చేయడం ద్వారా జీవనశైలిలో మార్పులు చేసుకోవచ్చు.చర్మంపై మంట లాంటి సమస్య ఉంటే అది నొప్పి, దురద, నిద్రలేని రాత్రులకు దారితీస్తుంది. ఈ సమస్య అంతర్లీనంగా వివిధ కారణాల వల్ల సంభవించే కారణముంది. చర్మం సహజంగా కలిగి ఉండే సామర్థ్యం కోల్పోవడమే ఇలా జరగడానికి ప్రధాన కారణం. ఇక దీంతో మీకు అసంతృప్తి లాంటి ఫీలింగ్ కలిగే అవకాశముంది. ఒకవేళ చర్మంపై మంట, వాపు, దురద లాంటి సమస్యలె తలెత్తితే చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశముంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, నిర్లక్ష్యం చేస్తే చర్మం మరింత డ్యామేజ్ అవుతుంది.


ఒమెగా 3, విటమిన్ డి, విటమిన్ ఎ లాంటి ఆహార పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోవాలి.సున్నితమైన ఆహారం, ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు ఉండే పోషకాహారాన్ని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి.మీరు తీసుకునే ఆహారంలో మంట కలిగించని పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. తాజా ఆకుపచ్చ కూరగాయలు, పసుపు, దాల్చిన చెక్క, సాల్మన్ ఫిష్, శుద్ధమైన తేనె లాంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి.మీ రెగ్యులర్ డైట్‌లో గ్లూటెన్, చక్కెర లాంటివి తొలగించండి. ఇలా చేస్తే 15 రోజుల్లో ఫలితం కనపడుతుందని నిపుణులు తెలిపారు.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాల గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: