రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం కాంతివంతంగా ఉండటానికి ఈ పద్ధతులు పాటించండి....

Purushottham Vinay
అందం ఇది ప్రతి వ్యక్తి కోరుకునే అంశం. అందంగా ఉండటం కూడా ఆరోగ్యంతో సమానమే. మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగితే మన చర్మం అంత కాంతి వంతంగా ఉంటుంది. కాబట్టి రక్త ప్రసరణ బాగా జరగాలి ఈ పద్ధతులు పాటించండి. రక్త ప్రసరణ బాగా జరగాలంటే ముందు ధూమ పానాన్ని మానుకోండి. దూమపానానికి అలవాటు పడిన వారికి రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. అందువల్ల వాళ్ళ ముఖంలో కాంతి తగ్గి ఎండి పోయినట్టు కనిపిస్తారు. కాబట్టి దూమపానాన్ని మానుకోండి. అలాగే మద్యం కూడా తగ్గించండి.వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్.. ఇలా ఏదో విధంగా శారీరక శ్రమ చేస్తే గుండె పని తీరు మెరుగుపడుతుంది. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వారానికి ఐదు రోజులపాటు రోజుకు కనీసం అరగంటపాటైన వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో క్యాలరీలు తగ్గి విష మలినాలు బయటకు పోతాయి. ఈక్రమంలోరక్త ప్రసరణ మెరుగు పడుతుంది. యోగాసనాలు వేసినా మంచి ఫలితాలే ఉంటాయి.నిత్యం ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. అలా అని ఫ్రూట్ జ్యూసులే తాగాల్సిన అవసరం లేదు. సాధారణ మంచి నీరు పుష్కలంగా తాగినా మంచి ఫలితం ఉంటుంది.

శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటే విష మలినాలు బయటకు వచ్చేస్తాయి. శరీరం తగినతం హైడ్రేటెడ్‌గా ఉంటే పోషకాలు కూడా చక్కగా ఒంట బడతాయి.వారానికి నాలుగు రోజులైన ఆకు కూరలు తీసుకోండి. సిట్రస్ ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తినండి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతే కాకుండా రోగ నిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకుంటే రక్త ప్రసరణ పెరిగి చర్మం మిలమిలా మెరవడం ఖాయం. చర్మ సంరక్షణకు టమాటా, అల్లం, కొత్తిమీర, బొప్పాయి, బాదం పాలు, క్యారెట్, బీట్‌రూట్, బేబీ కార్న్ జ్యూస్, పాలకూర, గుమ్మడి జ్యూస్‌ను తప్పకుండా తీసుకోండి.వారంలో నాలుగైదు రోజులు.. రోజుకు కనీసం పావు గంట సేపైనా ముఖానికి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇందు కోసం ఎవరో ఎక్స్‌పర్ట్స్ అక్కర్లేదు. మన మటుకు మనమే వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేసుకోవచ్చు.చల్లటి నీటితో రోజుకు రెండు సార్లయిన స్నానం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: