కేవలం ఒకే నెలలో జుట్టు సాంద్రతను పెంచే షాంపు ఏదో తెలుసా..!
ఒక షాంపూ కేవలం ఒక నెలలో జుట్టు సాంద్రతను పెంచుతుందా..?అదేం షాంపు..? అని ఆలోచిస్తున్నారా..! అవునండి ..ఇప్పుడు చెప్పబోయే ఒక షాంపూను మీరు కూడా వాడి కేవలం ఒక 30 రోజుల్లో మీ జుట్టును ఒత్తుగా పెంచుకోవచ్చు. అంతే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది . ఇక తలలో చుండ్రు, పేలు వంటి సమస్యలు కూడా దరిచేరవు. అయితే ఆ షాంపు ఏంటో.. ఎలా తయారు చేసుకోవాలో..? ఇప్పుడు తెలుసుకుందాం..
ఎగ్ షాంపూ:
దీన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక గుడ్డు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, బాదం నూనె ఒక టేబుల్ స్పూన్, ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్, షాంపు రెండు టేబుల్ స్పూన్లు. అయితే మీరు ఎంచుకునే షాంపులో గాఢత తక్కువ కలిగి ఉన్న షాంపూలను మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం .
ఆలివ్ ఆయిల్ జుట్టుకి కండిషనర్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు నష్టం జరగకుండా, తలలో రక్త ప్రసరణ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే జుట్టును మృదువుగా, సిల్కీ గా ఉంచుతుంది.
ఇక బాదం నూనెలో విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఖనిజాలు, ఒలేయిక్ ఆమ్లం తో పాటు లినోలేయిక్ ఆమ్లం కూడా ఉన్నాయి. దెబ్బతిన్న జుట్టును తిరిగి చైతన్యంగా మారుస్తాయి. జుట్టు మధ్యలో విరిగిపోయిన, జుట్టు కొనలు చిట్లి పోయి ఉన్నా కూడా ఆ భాగంలో వాటిని రిపేర్ చేస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ జుట్టు విచ్ఛిన్నత ను నివారిస్తుంది. కఠినమైన జుట్టు కుదుళ్లను మృదువుగా చేసి, జుట్టు ప్రకాశవంతంగా, కండిషనర్ లాగా ఉండేలా చేస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో ఆపిల్ సైడర్ వెనిగర్ లేకపోతే మీరు నిమ్మరసాన్ని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.
షాంపు విషయానికొస్తే.. మీరు ఎంచుకున్న షాంపులు సల్ఫేట్ రహితంగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి..
ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన మాత్రమే వేసి బాగా గిలకొట్టాలి . ఆ తరువాత ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్,ఆపిల్ సైడర్ వెనిగర్ తో పాటు షాంపూ కూడా కలిపి నాచురల్ షాంపూ గా తయారు చేసుకోవచ్చు. మీరు తలస్నానం చేసేటప్పుడు ఈ షాంపూ ని ఉపయోగించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.. అయితే ఈ షాంపూ తో తలస్నానం చేసేటప్పుడు మొదట గోరువెచ్చని నీటితో తలస్నానం చేసి, ఆ తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి.