ఒక మనిషి ముఖం అందంగా కనపడాలంటే ముఖ్యంగా అందమైన కళ్లు ముఖ్యం. కళ్లు అందంగా ఉంటేనే ముఖం అందంగా కాంతివంతంగా ఉంటుంది. అయితే కొంతమంది ఎంత తెల్లగా అందంగా వున్న వారి కళ్లు మాత్రం బాగోవు. కొందరు కళ్లద్ధాలు పెట్టుకోవడం వల్లనో లేక సరిగ్గా నిద్రపోకపోవడం వల్లనో తమ కంటి కింద నల్లటి వలయాలు వస్తుంటాయి.అలాంటి వారికి బాదం పప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం ఇది బలానికే కాదు అందానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.బాదం నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి మీ కళ్ళ క్రింద మెత్తగా మసాజ్ చేయండి. ఇంకా మెరుగైన ఫలితాల కోసం తేనె, మెత్తని అరటి పండు, కొబ్బరి నూనె మరియు కాఫీ పొడితో కలిపిన బాదం నూనెను కూడా ప్రయత్నించవచ్చు. ఈ ప్యాక్ వేసుకోవడానికి మీ ఇంట్లో తయారుచేసిన బాదం పేస్ట్‌ను ఉపయోగించవచ్చు లేదా బయట మార్కెట్లో దొరికే వాటిలో నాణ్యమైన కల్తీ లేని బాదం నూనెను కలిపి ఈ పేస్ట్ తయారు చేసుకోవచ్చు. కొన్ని సార్లు సౌందర్య ఉత్పత్తులు, సుగంధభరిత స్ప్రేలు వంటివి మీ సున్నితమైన కంటి చర్మంపై అలెర్జీలు లేదా చికాకును కలిగిస్తాయి.ఈ ప్యాక్ ట్రై చెయ్యడం వలన మీ కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
కొన్ని బాదంపప్పులను రాత్రిపూట నీటిలో నానబెట్టండి. ఉదయం బాదం పప్పుల తొక్కను తొలగించి వాటిని మెత్తగా చూర్ణం కింద చేయండి. దీనిని మెత్తటి పేస్ట్ వలె చేయడానికి కొన్ని చుక్కల పచ్చి పాలు కలపండి. చర్మాన్ని తేమగా మార్చడానికి మరియు చీకటి వలయాలు తొలగి పోవడానికి చర్మంపై పైన చికిత్స జరిగేందుకు వీలుగా ఈ పేస్ట్‌ను కళ్ళ క్రింద రాసుకోండి.ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.అలాగే కొన్ని చుక్కల బాదం నూనెను కళ్ళ క్రింద మెత్తగా మసాజ్ చేసుకోవాలి. అద్భుతమైన ఫలితాలు కావాలంటే మాత్రం రాత్రిపూట క్రమం తప్పకుండా ఈ మసాజ్ చేసుకోవాలి.ఇది చాలా సింపుల్ గా కళ్ల కింద నల్లటి వలయాలను నయం చేస్తుంది..