ముఖం అందంగా కనపడాలంటే ఈ పద్ధతులు పాటించండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ముఖ చర్మం మరీ జిడ్డుగా లేదా పొడిబారినట్టు కనిపిస్తే, ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవట్లేదని భావించాలి. ఒక్కొక్కరి చర్మం ఒక్కోలా ఉంటుంది. అందువల్ల చర్మ తత్వాన్ని బట్టి క్లెన్సర్‌ను ఎంచుకోవాలి. చర్మం పొడిగా ఉంటే మాయిశ్చరైజింగ్ క్లెన్సర్‌ వాడాలి. మామూలు క్లెన్సర్లు వీరి ముఖ చర్మంపై సెబమ్ ఉత్పత్తిని తగ్గించి మరింత పొడిబారుస్తాయి. ఆయిల్ స్కిన్ ఉండేవారు చర్మంపై అదనంగా పేరుకుపోయే నూనెలను శుభ్రం చేసే క్లెన్సర్‌ని ఎంచుకోవాలి.కొంతమంది రోజూ ముఖాన్ని శుభ్రం చేసుకున్నా సరే.. చర్మం పొడిగా, నిస్తేజంగా కనిపిస్తుంది.

ఇలాంటి సమస్య ఉన్నవారు సరైన క్లెన్సర్‌ను ఉపయోగించలేదని అర్థం. మృత కణాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల చర్మం నిగారింపును కోల్పోతుంది. ఇలాంటప్పుడు ఎక్స్ ఫోలియేటింగ్ ఫేస్ వాష్‌ను ఉపయోగించాలి.ముఖానికి వేసుకున్న మేకప్ పూర్తిగా తొలగించుకోకపోతే ఎన్నో దుష్ప్రభావాలు ఎదురవుతాయి. ముఖం కడిగిన తరువాత కాటన్ ప్యాడ్, టోనర్ సాయంతో చర్మంపై తుడవాలి. ఒకవేళ చర్మంపై ఫౌండేషన్ అవశేషాలు ఉంటే, ముఖం సరిగ్గా శుభ్రం చేసుకోవట్లేదని అర్థం. మేకప్‌ను పూర్తిగా తొలగించడానికి ఆయిల్ బేస్డ్ క్లెన్సర్ లేదా బామ్‌లను ఉపయోగించాలి. ఆ తరువాత మృదువైన క్లెన్సర్ వాడాలి. లేదంటే ముఖంపై పోగుపడే మేకప్ అవశేషాలు చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల చర్మం నల్లగా, డల్‌గా అనిపిస్తుంది.

మేకప్ ఉత్పత్తులు చర్మంపై సరిగ్గా అతుక్కోకుండా, మేకప్ ఊడిపోతుంటే.. ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవట్లేదని భావించాలి. మేకప్‌ వేసుకోవడానికి ముందు చర్మంపై పేరుకుపోయే మురికిని వదిలించుకోవాలి. లేదంటే ఇది చర్మానికి, మేకప్‌కు మధ్య ఒక అడ్డుపొరగా మారుతుంది. ఈ సమస్య ఎదురైతే నాణ్యమైన క్లెన్సర్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: