ఈ చిట్కాలు పాటిస్తే మీ ముఖం నిగనిగలాడటం ఖాయం...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ముఖం మెరిసిపోవాలి అంటే  తులసి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేయాలి. తరువాత నీళ్లు కలిపి ముఖానికి అప్లై చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. వారంలో ఫలితం కనిస్తుంది.కంటి చుట్టూ ఉండే డార్క్ సర్కిల్‌ను తొలగించాలి అనుకుంటే కీరదోస ముక్కల్ని మూసిన కనురెప్పలపై కాసేపు ఉంచితే ప్రయోజనం ఉంటుంది.ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలిగిపోవాలి అనుకుంటే కీరదోస ముక్కను తీసుకుని ముఖంపై మెల్లిగా రుద్దాలి.  కొన్ని నిమిషాల తరువాత  కీరదోసను తొలగించాలి.నిగనిగలాడే చర్మం కోసం నిమ్మకాయను కూడా వాడవచ్చు. నిమ్మకాయలో సహజసిద్ధమైన బ్లీచింగ్ లక్షణాల  వల్ల ముఖం‌పై పేరుకుపోయిన మలినాలు తొలగుతాయి. దీని కోసం తరచూ నిమ్మరసాన్ని ముఖానికి అప్లై చేయాలి.తేనె వల్ల చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది.  రోజుకు రెండుసార్లు ముఖంపై అప్లై చేయాలి.

 కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.స్ట్రాబెర్రీ, మిల్క్ క్రీంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ట్యాన్‌ను చాలా ప్రభావవంతంగా పోగొడుతుంది. అంతేకాదు డార్క్ స్పాట్స్ ని సైతం చర్మం రంగులో కలిసిపోయేలా చేస్తుంది.కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకొని వాటిని స్పూన్ సాయంతో లేదా బ్లెండర్‌లో వేసి మెత్తగా చేయాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ క్రీం కలపాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ప్యాక్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

బాగా ముగ్గిన బొప్పాయి పండు ముక్క తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా తేనె కలిపి.. రెండూ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: