జుట్టు ఊడిపోకుండా దువ్వే విధానం గురించి తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..జుట్టు ఊడిపోవడం చాలా మందికి ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. జుట్టు దువ్వుకునే పద్దతిలో కూడా మార్పు రావాలి.చాలా మంది ప్లాస్టిక్ దువ్వెన వాడుతారు. కాని అది అంత మంచిది కాదు. దాని బదులు చెక్క దువ్వెన వాడటం మేలు. ఎందుకంటే ఈ దువ్వెనతో చిక్కు తీయడం చాలా తేలిక. ఈ దువ్వెన వాడడం వల్ల జుట్టు మీద స్టాటిక్ ఎలెక్ట్రిసిటీ బిల్డప్ ఉండదు, ఫలితం గా బ్రేకేజ్ కీ, హెయిర్ లాస్ కీ కారణమయ్యే డ్రై, ఫ్రిజ్జీ హెయిర్ ఏర్పడదు. మెటల్ లేదా ప్లాస్టిక్ దువ్వెనల వల్ల ఈ సమస్యలు ఎదురు కావచ్చు. స్కాల్ప్ మీద ఉండే నాచురల్ ఆయిల్స్ ని ఈ దువ్వెన సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. తద్వారా జుట్టంతా మెరుస్తూ ఉంటుంది. ఈ దువ్వెన స్కాల్ప్ ని ఇరిటేట్ చేయదు, స్కాప్ ని మసాజ్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది, చుండ్రుని కూడా తగ్గిస్తుంది.

తలస్నానం చేసి జుట్టుకి ఉన్న మురికిని పోగొడతాం, కానీ దువ్వెనకి ఉన్న మురికిని పోగొట్టకపోతే అదంతా మళ్ళీ జుట్టు మీదకే చేరుతుంది కదా. అందుకనే మీ దువ్వెనని వారానికి రెండు సార్లు యాంటీ సెప్టిక్ లోషన్ తో క్లీన్ చేయండి. ఇందు వల్ల చుండ్రు, ఇన్‌ఫెక్షన్స్ వంటివి పెరగకుండా ఉంటాయి.ఎప్పుడూ జుట్టు చివరల నుండి పైవరకూ దువ్వండి. పొడుగు జుట్టు ఉన్న వారు తప్పనిసరిగా ఇలాగే చేయాలి. పై నుండి కిందకి దువ్వడం  వల్ల చిక్కు తీసేప్పుడు జుట్టుని లాగినట్లు అవుతుంది. అందుకని కింద నుండి పైకి చిక్కు తీసుకుంటూ వెళ్ళడం వల్ల జుట్టుకి ఈ ప్రాబ్లం ఎదురవదు. మొత్తం చిక్కు తీసేశాక అప్పుడు పై నించి కిందకి మృదువుగా దువ్వుకుంటూ రావచ్చు.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: