నోటి దుర్వాసనకు గల కారణాలు ఏంటో తెలుసా?

Divya
నోటి దుర్వాసనతో  చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నోటి దుర్వాసనకు కారణాల వల్ల  నలుగురితోనూ మాట్లాడలేక, తమకు తాము ఆ వాసనను  భరించలేక ఎంతోమంది ఇబ్బందికి గురి అవుతుంటారు. మనలో చాలామంది కొంతమందిని చూస్తేనే మాట్లాడడానికి ఇష్టపడతారు. మరికొంత మందిని చూస్తేనేమో చిరాకు పడుతుంటారు. ఇందుకు కారణం వారి నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది. అయితే నోటి దుర్వాసన అనేది సాధారణంగా అందరూ ఎదుర్కొనే సమస్య. అసలు నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? దానికి గల కారణాలు ఏమిటో?ఇప్పుడు తెలుసుకుందాం.

సైనసైటిస్, బ్రాంకైటిస్, డయాబెటిస్,కాలేయ, మూత్రపిండ వ్యాధులు లేదా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నోటి నుంచి చెడు వాసన వచ్చే అవకాశాలు ఎక్కువ.

సాధారణంగా పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. అలాగే కట్టుడుపళ్ళు ఉంటే వాటిని సరైన రీతిలో శుభ్రం చేయకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన రావడం మొదలవుతుంది.

ఇక మన నోటిలోని అనేక బ్యాక్టీరియాలు విడుదల చేసే వాయువులు, దంతాలు, చిగుళ్లు, నాలుక పై ఒక పొరలా ఏర్పడి,నోటి దుర్వాసనకు కారణమవుతాయి.

పొగతాగే వారిలో కూడా నోటి దుర్వాసన మరింత అధికంగా ఉంటుంది. అంతేకాకుండా మద్యపానం సేవించే వారిలో కూడా ఈ నోటి దుర్వాసన రావడం సహజం.

తరచూ నోటితో గాలి పీల్చే వారిలో నోటి దుర్వాసన  సమస్య ఎక్కువగా ఉంటుంది.  అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఘాటయిన పదార్థాలు తినడం లేదా కాఫీ తాగడం లాంటి పనులు చేయడం వల్ల కూడా నోటి నుంచి చెడు వాసన వస్తుంది.

ఇక చిగుళ్లవ్యాధి లేదా దంత సమస్యలు  ఏర్పడినప్పుడు కూడా నోటి నుంచి చెడు వాసన వచ్చే అవకాశం ఉంది.

అంతేకాకుండా నీటిని ఎక్కువగా తాగకపోవడం  వల్ల కూడా నోటిలో అత్యధికంగా  లాలాజలం ఏర్పడి, అది చెడు దుర్వాసనకు కారణం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: