పళ్లపై గార తో ఇబ్బంది పడుతున్నారా?

Divya
ప్రస్తుతకాలంలో ఉదయం లేవగానే పళ్ళు శుభ్రపరచుకోవడానికి బ్రష్ ను ఉపయోగిస్తుంటాము. రాత్రి తిన్న ఆహారం ఏదైనా పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయిన, పళ్ళ పై ఉన్న పసుపు పచ్చటి వర్ణాన్ని తొలగించడానికి ఉదయాన్ని టూత్ పేస్ట్ తో కాని టూత్ పౌడర్ తో కాని పళ్ళు శుభ్రం చేస్తుంటారు. కానీ పురాతన కాలంలో మాత్రం వేప పుల్లతో, బొగ్గుతో, కళ్ళుప్పు తో దంతాలను శుభ్రం చేసుకునేవారు. వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల దంతాలపై మరియు  నోటిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోవడమే కాకుండా దంతాలతోపాటు చిగుళ్ళు కూడా గట్టిపడేవి. కానీ ప్రస్తుతం వాడుతున్న టూత్ బ్రష్, టూత్ పేస్ట్ లా కారణంగా పళ్ళల్లో ఉండే బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోకుండా కొంత శాతం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఏదైనా ఆహారం తింటామో  అప్పుడు మన నోట్లో ఉండే బ్యాక్టీరియా మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే ప్రోటీన్లు,గ్లూకోస్ తోపాటు బయో ప్రొడక్ట్స్  తీసుకొని వాటి దగ్గర ప్లేక్ ను  తయారు చేస్తాయి.


అయితే ఈ ప్లేక్, మనం దంతాలను  ఫాస్ట్ ఫాస్ట్ గా శుభ్రం చేసుకోవడం వల్ల దంతాల లోపలి భాగం వద్ద అలాగే ఉండిపోతుంది. సమయం గడిచే కొద్దీ ఈ ప్లేక్ మందపాటి లేయర్ లాగా ఏర్పడి గార మాదిరిగా  తయారవుతుంది. దీనిని తొలగించుకోవడానికి ఎన్ని చిట్కాలు పాటించినా  ఫలితం ఉండక, డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి,ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా దంతాలపై ఉండే ప్లేక్ ను తొలగించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


ఒక టమోటా,  కమలా కాయ తొక్కు,ఉప్పు. ఈ  మూడింటినీ తీసుకుని ఒక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ టూత్ బ్రష్ మీద వేసి, కొద్దిగా ఉప్పు దాని మీద వేసి బ్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ రోజువారి బ్రష్ చేసుకుని టూత్ పేస్ట్ తో మరొకసారి బ్రష్ చేసుకోవాలి.

ఒక చిన్న కప్పు  తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, అర స్పూన్ బేకింగ్ సోడా, ఒక పావు టీ స్పూన్ ఉప్పు కలిపి మూడింటిని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చేతివేళ్ళతో కానీ టూత్ బ్రష్ తో కానీ మీ పళ్ళను బ్రష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బేకింగ్ సోడా మన పళ్లపై ఉండే పసుపుదనాన్ని  తొలగించడం తోపాటు బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది.

పైన చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల త్వరగా మీ పళ్లపై ఉండే గార, పసుపుదనం పోయి పళ్ళు తెల్లగా నిగ నిగ లాడుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: