జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి?

Divya

జుట్టు ఒత్తుగా పెరగాలనే  కోరిక ప్రతి అమ్మాయికి ఉంటుంది. కానీ ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల, కాలుష్యం,జెనిటిక్ సమస్యలు, ఒత్తిడి కారణంగా జుట్టు తరచూ రాలిపోయే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య అధికమైనప్పుడు బట్టతల వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మనం తరచూ చూస్తూనే ఉంటాము చిన్న వయసు వారిలో కూడా బట్టతల రావడం సహజంగా మారిపోయింది. కాబట్టి జుట్టు సమస్య మొదలవగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

అయితే జుట్టు రాలడాన్ని తగ్గించడం కోసం,తలస్నానం చేసే ముందు షాంపూలో  ఆ రెండింటినీ కలిపి రాయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఆ రెండు ఏంటంటే కలబంద గుజ్జు తో పాటు బియ్యపు నీళ్లు. ఈ రెండింటినీ షాంపూలో ఎలా కలిపి వాడితే ప్రయోజనం ఉంటుందో  ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

 ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బియ్యం పై ఉన్న దుమ్ము,పాలిష్ వెళ్లిపోతాయి.  ఆ తర్వాత ఈ బియ్యానికి రెండు గ్లాసుల నీరు పోసి  బాగా నానబెట్టాలి.వీలైతే రాత్రంతా ఉంచినా సరిపోతుంది.ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవాలి. ఆ నీటిలో ఎక్కువగా విటమిన్ బి,విటమిన్ ఇ, విటమిన్ సి తోపాటు ఎమినోయాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.ఈ బియ్యపు నీటిని షాంపూలో కలిపి తలస్నానం చేసేటప్పుడు,తలకు బాగా పట్టించి మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కొనలు చిట్లి పోవడం, చుండ్రు,  జుట్టు నిర్జీవంగా మారడం లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.

అంతేకాకుండా షాంపూలో కొద్దిగా ఆలోవెరా గుజ్జును కలిపి రాసుకోవడం వల్ల కూడా జుట్టుకు తగినంత తేమ అంది జుట్టు పొడిబారకుండా ఉంటుంది. అలోవెరా గుజ్జు తో పాటు బియ్యపు నీళ్లు జుట్టును మృదువుగా,ఒత్తుగా పెరగడానికి  సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: