కలబంద ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Divya

కలబంద ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఇది ఎలాంటి భూమిలో నైనా జీవించగలుగుతుంది. వీటికి నీరు కూడా ఎక్కువగా అవసరం ఉండదు. మనలో చాలామంది ఇళ్లలోనే వీటిని పెంచుకుంటారు. కలబంద కేవలం ఔషధంగా మాత్రమే కాకుండా ఎన్నో రకాల వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అంతేకాకుండా ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. అయితే చాలామందికి కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియదు. కలబందను ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అని, ఏ మొక్క అందించలేని ఔషధాలు మనకు అందిస్తుందని మీకు తెలుసా?  కలబంద  మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కలబంద మన శరీరానికి, ముఖానికి, జుట్టుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో దానిని ఎలా వాడుకోవాలో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

కలబందను ఎక్కువగా కాస్మెటిక్ తయారీలోనూ, ఔషధాల తయారీలోనూ వాడుతుంటారు. అంతేకాకుండా క్రీమ్స్, లోషన్స్, యోగర్ట్ క్రీమ్స్ అంటూ ఎన్నో విధాలుగా కలబందను వాడుతున్నారు.

కలబంద ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల శరీరంలోని అన్నిరకాల వ్యాధులను అరికడుతుంది.జీర్ణశక్తిని పెంపొందించుకోవడానికి, గుండె మంట తగ్గించుకోవడానికి,అజీర్తి వల్ల ఏర్పడే సమస్యలను దూరం చేస్తుంది.

శరీరంలో ఏ భాగమైనా కాలినప్పుడు చర్మంపైన ఈ కలబంద రసాన్ని పూయడం వల్ల త్వరగా మానుతుంది. ఈ కలబంద గుజ్జును కొద్దిగా రోజ్ వాటర్ లో కలిపి శరీరానికి పూయడం వల్ల  చర్మం చలికాలంలో పొడిబారకుండా ఉంటుంది.

కలబందగుజ్జుకు, కొద్దిగా తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేయాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్స్ ను అద్ది  ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం మీద ఉండే మృతకణాలు తొలగిపోయి, ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ కలబంద గుజ్జును మాడు పై రుద్దుతూ మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే చుండ్రు పోయి జుట్టు మెత్తగా తయారవుతుంది.

జుట్టు రాలే సమస్యలు ఉన్నవారు కలబంద గుజ్జుకు, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి మాడుతోపాటు తలవెంట్రుకలకు మొత్తం పట్టించాలి. ఆతరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. నెలకు రెండు నుండి మూడు సార్లు ఈ పద్ధతిని పాటించడం వల్ల త్వరలోనే జుట్టురాలే సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

కలబంద గుజ్జును రోజు తినడం వల్ల, శరీరంలోని నీరసత్వం తొలగిపోయి,రోజంతా ఉత్సాహంగా ఉంటారు.  అంతేకాకుండా కాళ్ళ పగుళ్ళకి కూడా కలబంద మంచి ఔషధంగా పనిచేస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు కలిగిన కలబందను మీ ఇంట్లో కూడా పెంచి ఔషధగుణాలను ఆస్వాదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: