వంటగదిలో పనిలో ఉన్నప్పుడో లేదా ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడో కంట్లో నలుసు పడితే.. చేత్తో నలపటంకానీ, రుద్దటంకానీ చేయవద్దు. అలా చేస్తే చేతికి ఉండే మట్టి, ధూళికణాలు, సూక్ష్మక్రిములు కంట్లో చేరి అలెర్జీ, ఇన్‌ఫెక్షన్లను కలిగించే ప్రమాదం ఉంటుంది. కంట్లో నలక పడితే వెంటనే చేతులను శుభ్రం చేసుకుని చేతివేళ్లతో నీటిని కళ్లపై చిలకరించి మెత్తని, శుభ్రమైన గుడ్డతో కళ్లు తుడిస్తే సరిపోతుంది.
కళ్ళను రోజుకు వీలైనంత వరకు రెండుసార్లుకంటే ఎక్కువ కడుగకూడదు. కంటికి సరిపడా నిద్ర, విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. కంటి అందాన్ని పెంచేందుకు వాడే వస్తువులు సాధ్యమైనంవరకు కంపెనీ ఉత్పత్తులనే వాడాలి. కాటుక దిద్దిన కళ్ళ చూపు చాలా శృంగార భరితంగా ఉంటుంది. అయితే కాటుక పెట్టుకునేటప్పుడు చేతివేళ్ళు శుభ్రంగా లేకపోతే క్రిములు కంట్లోకి ప్రవేశించి లోపలి భాగాలు దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల చేతులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
కనురెప్పల వెంట్రులకు నలుపు రంగుతో సింగారిస్తే కళ్ళు పెద్దవిగా చాలా అందంగా ఉంటుంది. కళ్ళకు మంచి షేప్ రావడం కోసం ఐ లైనర్‌ను వాడతారు .దీన్ని వాడేటప్పుడు కంట్లో చిన్న చుక్క కూడా పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. కంటి మేకప్ అవసరం తీరిన తర్వాత తొలగించేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే కళ్ళకు ప్రమాదం జరగవచ్చు. కొంతమంది మేకప్ తొలగించేందుకు దూదిని నీటిలో ముంచి శుభ్రం చేస్తుంటారు. ఇది సరైన పద్దతి కాదు. మేకప్‌ను తొలగించేందుకు తయారైన ప్రత్యేకమైన ఆయిల్‌ను మాత్రమే ఉపయేగించాలి లేదా బేబీ ఆయిల్ వాడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: