మొటిమల సమస్యను తగ్గించుకోవడానికి రోజు ఈ పద్ధతులు పాటించండి..
మొటిమల సమస్య తగ్గించుకోవాలంటే మొదట మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఫేసియల్ క్రీమ్‌ను అప్లై చేయాలి. మిల్క్ క్రీమ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. చిటికెడు పసుపును అలాగే శనగపిండిని కలపండి. ఈ పేస్ట్ కొంచెం చిక్కగా ఉండటం వల్ల ముఖంపై ఈవెన్ గా మసాజ్ చేసుకోవాలి. ముఖ్యంగా పింపుల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతంలో కూడా మసాజ్ చేయాలి. ఇది ముఖంపై నుంచి అదనపు నూనెను గ్రహిస్తుంది. స్కిన్ ను హైడ్రేటెడ్ గా అలాగే క్లీన్ గా ఉంచుతుంది.ఇలా రోజు ఒక పది నిమిషాల పాటు చెయ్యండి. మీ చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది.
ఒక టీస్పూన్ రైస్ ఫ్లోర్ ను తీసుకుని కాస్తంత మిల్క్ క్రీమ్ ను కలపండి. ఆ తరువాత ముఖంపై అలాగే మెడపై ఈ మిశ్రమంతో సర్క్యూలర్ మోషన్లో మసాజ్ చేయండి. మిల్క్ క్రీమ్ ను కాస్తంత తేనెతో కలపండి. ముఖంపై అప్లై చేసుకోండి. స్కిన్ పై ఇది సెటిల్ అవనివ్వండి. కొన్ని నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో వాష్ చేయండి. సెలూన్ వంటి గ్లోను మీరు మీ ముఖంపై గమనిస్తారు. చాలామందికి స్క్రబ్స్ ను సరైన విధంగా ఎలా వాడాలో తెలియదు. ఎంత మేరకు స్క్రబ్ ను వాడాలి, ఎటువంటి ఎక్సోఫ్లియేటర్ ను వాడాలి అన్న విషయంపై సరైన అవగాహన ఉండదు. జెంటిల్ స్క్రబ్స్ నే వాడాలి. హోమ్ మేడ్ ఐతే మరీ మంచిది.
వాతావరణంలోని మార్పుల బట్టి స్కిన్ కేర్ విషయంలో మరింత శ్రద్ద వహించాలి.వయసును, ఏజ్ ను అలాగే రొటీన్ ను దృష్టిలో పెట్టుకుని స్కిన్ కేర్ లో మార్పులూ చేర్పులూ చేసుకోవాలి. టమాట పండు రసాన్ని రోజుకి రెండుసార్లు ముఖానికి అప్లై చేసుకోండి. ఇలా రోజుకు రెండుసార్లు అప్లై చేసుకోవడం వలన ముఖం కాంతివంతంగా తయారవుతుంది. కాబట్టి టమాటా రసం అప్లై చెయ్యండి. అలాగే మజ్జిగ, లస్సి లాంటివి రోజు త్రాగడం అలవాటు చేసుకోండి. ఇవి రోజు తాగడం వలన శరీరంలో వేడి తగ్గి మొటిమలు రాకుండా ఉంటాయి.
కాబట్టి ఈ పద్ధతులు ప్రతి రోజు పాటించండి. కచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.