జుట్టు రాలుతుందా...? చుండ్రు వేదిస్తుందా...? అయితే ఈ చిట్కాలు పాటించండి
అంతే కాదు మన శిరోజాలకు తేమ చక్కగా మందారం అందిస్తుంది. సగం కప్పు నీళ్లలో రెండు మందార పువ్వులను వేసుకుని 5 నిమిషాలు బాగా మరిగించాలి. అది చల్లారిన తర్వాత అందులో టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో పాటుగా పెరుగు, రెండు చుక్కలు లావెండర్ నూనె వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని వెంట్రుకలకు పట్టించి 20 నిమిషాల తరువాత షాంపు తో చాలా నీట్ గా కడుక్కోండి.
అంతే కాకుండా చుండ్రు సమస్య తగ్గేందుకు కొన్ని మందార పువ్వులు, మందార ఆకులను రోటిలో మెత్తని పేస్టులా చేయండి. ఈ పేస్టుకు టేబుల్ స్పూను పెరుగు, కలబంద గుజ్జు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు రాసుకొని 20 నిమిషాల తర్వాత షాంపుతో నీట్ గా కడుక్కోండి. లాగే కొన్ని మందార ఆకులు, ఒక ఉల్లిపాయ, కలబంద గుజ్జును పేస్టులా చేసుకోండి. ఆ పేస్టులో రెండు చుక్కలు రోజ్‌మేరీ ఆయిల్ తో పాటుగా ఒక చుక్క లావెండర్ నూనె వేసి కలిపి... ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించి అర గంట తరువాత షాంపుతో వాష్ చేసేయండి. ఇది జుట్టు రాలే వారికి చుండ్రు సమస్యకు బాగా పరిష్కారం చూపిస్తుంది.