అందం: అర‌టి తొక్క‌ను ఇలా ఎప్పుడైనా ఉప‌యోగించారా..?

Kavya Nekkanti

సాధారణంగా చాలా మంది అర‌టి పండును తిని తొక్క‌ను మాత్రం చెత్త బుట్టలో పాడేస్తుంటారు. కాని, ఇక నుంచి అలా చేయకండి. ఎందుకంటే అర‌టి తొక్క‌తో కూడా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అరటిపండు తొక్కలో అధిక శాతంలో విటమిన్లు, ఖనిజాలు, బి6 , బీ12, ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, అరిగే పీచు పదార్ధాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రోటీన్లు ఉంటాయి. అర‌టి తోక్క ఆరోగ్యాన్ని అందించ‌డ‌మే కాకుండా.. చ‌ర్మానికి ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌పడుతుంది.

 

అర‌టి తొక్కతో మొటిమల మీద రుద్దితే ఒక్క రాత్రిలో మటుమాయం అవుతాయి. అలాగే ఎగ్‌‌వైట్‌‌లో అరటిపండు తొక్కను గుజ్జుగా చేసి ముఖానికి పట్టిస్తే ముడుతలు మటుమాయం అవ్వ‌డ‌మేకాకుండా.. ముఖం కాంతివంతంగా మార‌తుంది. అలాగే అరటి తొక్కలో స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలున్నాయి. ఇది దోమకాటు వల్ల ఏర్పడ్డ దద్దుర్ల సైజ్ ను తగ్గించి, మంట, వాపు, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అరటి తొక్క దురదను తగ్గిస్తుంది. {{RelevantDataTitle}}