శరీరం పై "తెల్లటి మచ్చలు".. పోగొట్టే అద్భుతమైన వంటింటి చిట్కా...!!!

NCR

సాధారణంగా చాలామంది లో ముఖంపై లేదా వీపు పైభాగంలో తెల్లని మచ్చలు చిన్న చిన్న చుక్కల కనిపిస్తూ ఉంటాయి. అధికంగా ఈ మచ్చలు వీపు మీద కనిపించడం చాలామంది గమనించే ఉంటారు. ఇవి అందవిహీనంగా, ఎంతో ఇబ్బందికరంగా, మానసికంగా కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అసలు ఈ మచ్చలు ఎందుకు ఏర్పడతాయి వీటిని ఎలా తొలగించుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.

శరీరంలో మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలు తెల్లటి మచ్చలు ఏర్పడేలా చేస్తాయి. ఈ సమస్య వచ్చినప్పుడు ముందుగానే పరిష్కరించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాల కు గురి కావడం వల్ల కూడా తెల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో ఎన్నో రకాల క్రీములు, లోషన్లు దొరుకుతున్నా, వీటిపై పూర్తిస్థాయిలో నమ్మకాన్ని పెట్టుకుంటే అది మరిన్ని దుష్పరిణామాలకు కారణం కావచ్చు. అందుకే సహజసిద్ధమైన పద్ధతులను పాటించి ఈ తెల్లటి మచ్చలను దూరం చేసుకోవచ్చు..ఎలాగంటే.

కొబ్బరి నూనె ద్వారా ఈ తెల్లటి మచ్చలను పూర్తిగా నయం చేసుకోవచ్చు. కొబ్బరినూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి, మరియు ఇది చర్మం పై ఏర్పడిన మచ్చలను తొలగించటంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా స్వచ్ఛమైన కొబ్బరి నుంచి తీసిన కొబ్బరినూనె తీసుకుని రెండు మూడు చుక్కలు తెల్లటి మచ్చలపై మసాజ్ చేయాలి, సుమారు ఐదు నిమిషాలు ఇలా చేసిన తర్వాత పడుకునే ముందు కూడా ఇదే పద్దతిని పాటించాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే శుభ్రం చేసుకోవాలి ఇలా చేసుకుంటే తప్పకుండా తెల్లటి మచ్చలు తొలిగిపోతాయి..అలాగే

అల్లం కూడా తెల్లని  మచ్చలను దూరం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని అల్లం ముక్కలు తీసుకుని మెత్తగా చేసుకుని రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని  చర్మంపై మచ్చలకు రాసుకోవాలి, ఇలా రాసుకున్న తర్వాత అల్లాన్ని 5 నుంచి పదినిమిషాల పాటు ఉండనివ్వాలి. తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే త్వరితగతిన ఈ మచ్చలు తొలిగిపోతాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: