కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడి బాధ పెడుతుంటే, హాయిగా ఎనిమిది గంటల పాటు గాఢంగా నిద్ర పోవాలి. పచ్చి బంగాళాదుంపను సన్నటి చక్రాల్లాగా కోయాలి. దానితో కంటి చుట్టూ వృత్తాకారంలో రుద్దాలి. ఒక గ్లాసులో పచ్చి పాలను తీసుకుని దూదితో కంటి చుట్టూ రాసి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. టేబుల్ స్పూన్ టమోటోగుజ్జుకు చిటికెడు పసుపును, అరస్పూను నిమ్మరసం,చిటికెడు బియ్యంపిండిలను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాసి ఇరవై నిమిషాలు ఉంచాలి. వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: