చెమట తో బాధపడే వారికి సువాసనను వెదజల్లే బ్యూటీ టిప్స్

Durga
ఎండాకాలంలో  శారీరక శ్రమ చేసేవారికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ చెమటతోపాటు శరీరం నుంచి అనాయాసంగా అమోనియా, ప్రొటీన్లు, కొవ్వు, ఆమ్ల లవణాలుకూడా శరీరంలోంచి బయటకు వచ్చేస్తాయి. చెమటతో చర్మం తేమగా వుంటుంది. ఎండకు, ఎక్కువ వేడికి చర్మం ఎండిపోకుండా ఉండేందుకు చెమట పోస్తుంది.   ఇది శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. కాని చెమటతోబాటు దుర్గంధం రావడం కాస్త ఇబ్బందికరమైన విషయం. ఇలాంటి సమస్య అతి కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. చెమట ఎండిపోయిన తర్వాత చర్మం నుంచి యూరియా లేక్ ఉప్పులాంటి కారకాలు అధికంగా స్రవించి రోగ కారకాలను ఆకర్షిస్తాయి. ఇవే దుర్గంధానికి మూల కారణమవుతాయి. కొంతమందికి అత్యధిక చెమట వచ్చినా కూడా దుర్వాసన రాదు. కాని కొంతమందిలో చెమట తక్కువగా వచ్చినా కూడా దుర్గంధం భరించరానంతగా వుంటుంది. దీనినుండి బయట పడటం ఏమంత కష్టం కాదంటున్నారు వైద్యులు. దీనికి కారణం- అజీర్తి, ఏదిపడితే అది ఆహారంగా తీసుకోవడం, ఎక్కువగా ఉప్పు తీసుకోవడం కూడా ఒక కారణం. పరిష్కారం- కడుపు శుభ్రంగా వుంచుకోవాలి. సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా త్రాగాలి, రెండుపూటలా స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు డెట్టాల్, యుడుకొలోన్, రోజ్ వాటర్ వీటిలో ఏదైనా కొన్ని చుక్కలు కలుపుకుని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మంచి కంపెనీకి చెందిన బాడీ స్ప్రే వాడాలి. ఎవరికైతే తమ చెమటలోంచి భరించలేనంత దుర్గంధం వస్తుందో వారు బాత్ సాల్ట్‌ను నీటిలో కలిపి స్నానం చేయాలి. సువాసనను వెదజల్లే పౌడరు వాడాలి. స్నానం చేసిన తర్వాత ధరించే దుస్తులపై పర్ఫ్యూమ్ వాడాలి. ఆ పర్ఫ్యూమ్ భరించలేనంత వాసన ఉండకూడదు. ఎండాకాలంలో కాటన్ బట్టలనే వాడాలి. అవికూడా పల్చటి దుస్తులనే ధరించాలి. సింథటిక్ బట్టలను ఎట్టి పరిస్థితులలోనూ వాడకూడదు. ఎందుకంటే ఇవి చెమటను మరింత అధికంగా వచ్చేలా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: