కనుముక్కుతీరు ఎంత చక్కగా ఉన్నా చర్మం అందంగా ఉంటేనే మరింత ఆకర్శణీయంగా కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ చర్మంలోని తేమ తగ్గిపోతుంటుంది. క్రమేపీ చర్మం మృదుత్వాన్ని కోల్పోయి బిరుసుగా తయారవుతుంది.
ముఫ్పై నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు వారికి కళ్ళక్రింద నల్లని వలయాలు, మడతలు వంటివి ఏర్పడి దిగులు పెడుతుంటాయి. వీరి చర్మం కూడా బాగా పొడిగా ఉంటుంది. దీనివల్ల వయసు మరింత పైబడినట్లు కనిపిస్తారు. కళ్లకింద వలయాలు సాధారణంగా వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని లేజర్ చికిత్స ద్వారా పాక్షికంకంగా తగ్గించుకోవచ్చు.
ఈ చికిత్స తీసుకునే సమయంలో ముఖానికి ఎండ తగలకుండా జాగ్రత్త వహించాలి. రాత్రిపూట పడుకునేముందు కొద్దిగా ఆల్మండ్ క్రీమ్ ను కంటి చుట్టూరాసీ నెమ్మదిగా మసాజ్ చేయాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయి. అల్ఫా హైడ్రోక్సియాసిడ్స్ లేదా రెటివాల్స్ గల నైట్ క్రీమ్ను ముఖానికి మెడకు రోజూ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గ్లైకోరిలిక్ యాసిడ్ పిల్స్ కళ్ళకింద వలయాలను, ముడతలను తగ్గిస్తాయి. నలభయ్యవ పడిలో చర్మం సాధారణంగా డ్రై అవుతుంది. ఈవెనింగ్ ప్రీమ్రోజ్ ఆయిల్, యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ సి సప్లిమెంట్లను రోజు తీసుకోవడం వల్ల ప్రయోజనం వుంటుంది. ఉదయం రెండు బాదం పప్పులను కొంచెం పాలల్లో నానపెట్టాలి. రాత్రి వాటిని మెత్తగాచేసి ఈ పేస్టును కళ్లచుట్టూ రాస్తే బాక్ల్ సర్కిల్స్ తగ్గుతాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: