జియో: హైస్పీడ్ 5G నెట్‌వర్క్‌ కోసం లక్ష టవర్‌లు?

Purushottham Vinay
జియో : హైస్పీడ్ 5g నెట్‌వర్క్‌ కోసం లక్ష టవర్‌లు ?

ఇక 5జీ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో ప్రత్యర్థులకు ఆకాశంలో చుక్కలు చూపిస్తోంది. దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో అత్యంత వేగవంతమైన 5g టెలికాం నెట్‌వర్క్‌ను అందించడానికి దాదాపు ఒక లక్ష టెలికాం టవర్‌లను ఇన్‌స్టాల్ చేసింది.డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వివరాల ప్రకారం ఇండియన్ బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దేశంలోనే అత్యంత వేగవంతమైన 5జీ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టడానికి ఇంకా అలాగే అల్ట్రా-హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి దాదాపు 1 లక్ష టెలికాం టవర్‌లను నిర్మించింది.ఇక ఇది దాని సమీప ప్రత్యర్థి కంటే కూడా దాదాపు ఐదు రెట్లు ఎక్కువని చెప్పాలి.ఇక డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నేషనల్ ఈఎంఎఫ్‌ పోర్టల్‌లో ఉంచిన రోజువారీ స్థితి నివేదిక నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం జియో రెండు ఫ్రీక్వెన్సీలలో (700 MHz, 3,500 MHz) 99,897 బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్‌లను (బీటీఎస్) ఇన్‌స్టాల్ చేసింది. 


ఇంకా అలాగే మరోవైపు ఎయిర్‌టెల్‌కు మొత్తం 22,219 బీటీఎస్ లు ఉన్నాయి. ఇక ప్రతి బేస్ స్టేషన్‌కు జియోకు 3 సెల్ సైట్‌లు ఉండగా ఎయిర్‌టెల్‌కు 2 మాత్రమే ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఇంటర్నెట్‌ స్పీడ్‌కు, సెల్ సైట్‌లు ఇంకా అలాగే టవర్‌లకు పరస్పర సంబంధం అనేది ఉంటుంది.జియో ఉత్తమ ఇంటర్నెట్‌ సగటు వేగం సెకనుకు మొత్తం 506 మెగా బైట్లు (Mbps) కాగా ఎయిర్‌టెల్‌ యావరేజ్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ వచ్చేసి 268 Mbps అని ఇంటెలిజెన్స్ ఇంకా కనెక్టివిటీ ఇన్‌సైట్ గ్లోబల్ లీడర్ అయిన ఊక్లా గత ఫిబ్రవరి నెలలో నివేదించింది.ఇలా జియో తన ప్రత్యర్థులని తన దారిదాపుల్లోకి కూడా రానీయకుండా నెంబర్ నెట్వర్క్ గా దూసుకుపోతుంది. తన వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటూ కొత్త వినియోగదారులని పెంచుకుంటూ పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: