ప్రతి వారం వేల కోట్లు పోగొట్టుకుంటున్న అదాని?

Purushottham Vinay
ఫేమస్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ గౌతమ్ అదానీ ఎంత దారుణంగా పతనం అవుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాపం ఏడాది కాలంగా ఆయన ప్రతి వారం కూడా రూ.3000 కోట్ల దాకా నష్టపోతున్నారని సమాచారం తెలుస్తుంది.ఇప్పుడతని సంపద 53 బిలియన్ డాలర్లకు తగ్గిపోయిందని ఎంత్రీఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 పేర్కొంది. కొన్ని రోజుల క్రితం ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న అదాని ఇప్పుడు 23కు తగ్గిపోయారని వెల్లడించింది. ఈ హిండెన్బర్గ్ రిపోర్టుతో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే.కొన్ని నెలల్లోనే గౌతమ్ అదానీ 28 బిలియన్ డాలర్ల నికర సంపదను నష్టపోయారు. దాంతో ఇండియాలో అత్యంత సంపన్నుడి స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి  వదిలేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నెట్వర్త్ 82 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా. ఇక తన సంపదలో 35 శాతం నష్టపోవడంతో గౌతమ్ అదానీ కుటుంబం ఆసియా రెండో సంపన్నుడి స్థానాన్ని కూడా కోల్పోయి చివరికి ఝాంగ్ షాన్షన్కు వదిలేయాల్సి వచ్చింది.


హిండెన్ బర్గ్ నివేదిక వచ్చినప్పట్నుంచి అదానీ 60 శాతం సంపద కోల్పోయారని హురున్ ఇండియా  వెల్లడించింది.చివరి ఏడాది కాలంలో అదానీ ఏకంగా 35 శాతం సంపద కోల్పోయారు. ప్రపంచ కుబేరుల్లో తొమ్మిదో స్థానంలో నిలిచిన అంబానీ మొత్తం 20 శాతం సంపద నస్టపోయారు. అవెన్యూ సూపర్ మార్కెట్ (డీమార్ట్) ఛైర్మన్, స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్ రాధాకృష్ణ దమానీ ఇంకా ఆయన కుటుంబం 30 శాతం సంపదని నష్టపోయారు. ప్రస్తుతం వారి సంపద 16 బిలియన్ డాలర్లుగా ఉందని సమాచారం. ఇక గ్లోబల్ టాప్-100 నుంచీ కూడా ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.అలాగే కొటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో ఉదయ్ కొటక్ మొత్తం 13 శాతం నష్టపోయారు. ఆయన సంపద 14 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ సంపన్నుల్లో ఆయన ర్యాంకు 135గా ఉంది. వ్యాక్సింగ్ కింగ్ సైరస్ పూనావాలా  ఆస్తి 4 శాతం పెరిగి మొత్తం 27 బిలియన్ డాలర్లకు చేరుకుంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్టులో ఇండియా 187 బిలియనీర్లతో మూడో స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా దేశాలు అయితే మన కన్నా ముందున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: