దారుణంగా క్షీణించిన అదాని సంపద?

Purushottham Vinay
ఇండియాకి చెందిన ఫేమస్ బిజినెస్ గౌతమ్ అదానీ ఆస్తి క్రమంగా దారుణంగా క్షీణిస్తోంది. దీంతో ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి అయిన  అదానీ ఇప్పుడు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో చాలా దారుణంగా 21 వ స్థానానికి పడిపోవడం జరిగింది.గత రెండు వారాల నుంచి కూడా గౌతమ్ అదానీ కంపెనీల షేర్లలో భారీ క్షీణత నమోదవుతోంది. దీని వల్ల షేర్లపై చాలా రెట్లు లోయర్ సర్క్యూట్ విధించాల్సి వస్తుంది. ఇక గౌతమ్ అదానీ షేర్లలో భారీ అమ్మకాలు కనిపించడం వల్ల అతని నికర విలువలో స్థిరమైన క్షీణత ఎక్కువగా ఉంది.ఇటీవల భారతదేశపు పెద్ద వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఇక ఆస్తుల పరంగా గౌతమ్ అదానీ చాలా వెనుకబడ్డాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. తెలిసిన విషయం ఏమిటంటే..ముఖేష్ అంబానీ మొత్తం నికర ఆస్తుల విలువ 82.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

 ఇంకా అలాగే మరోవైపు గౌతమ్ అదానీ మొత్తం నికర విలువ ఇప్పుడు అది $61.3 బిలియన్లకు పడిపోవడం జరిగింది.ఇక అదే సమయంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల తయారీ సంస్థ బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం నికర విలువ వచ్చేసి $217.5 బిలియన్లు ఉంది. మరోవైపు ఎలోన్ మస్క్ ఈ లిస్టులో రెండవ స్థానంలో ఉన్నాడు. అతని మొత్తం నికర విలువ $ 183.2 బిలియన్ గా ఉంది. ఇక మూడో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు అయిన జెఫ్ బెజోస్ ఉన్నారు. అతని మొత్తం నికర సంపద వచ్చేసి $136 బిలియన్లుగా ఉంది.గత వారంలో అదానీ షేర్ల పతనం వల్ల స్టాక్ మార్కెట్‌లో లిస్టు చేయబడిన అతని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ $ 110 బిలియన్ల కంటే చాలా ఎక్కువ క్షీణతను నమోదు చేసింది. ఆదానీ పవర్ షేర్లు 4.98 శాతం, అదానీ విల్మార్ లిమిటెడ్ షేర్లు 5 శాతం ఇంకా అలాగే అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 21.61 శాతం పడిపోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: