ఇండియన్ రైల్వే: వాట్సాప్ ద్వారా అదిరిపోయే సేవలు?

Purushottham Vinay
IRTC PNR స్టేటస్‌ను ట్రా చేయడం ఇప్పుడు మరింత ఈజీ చేసింది భారత రైల్వే శాఖ. రైల్వే ప్రయాణికులు ఇప్పుడు తమ వాట్సాప్‌ ద్వారా కూడా రియల్ టైమ్ ట్రైన్ రన్నింగ్ షెడ్యూల్ ఇంకా అలాగే పీఎన్ఆర్ స్టేటస్‌ను చూడొచ్చు.ముంబై సిటీకి చెందిన స్టార్టప్ రైలోఫీ-రోడియో ట్రావెల్ టెక్నాలజీస్‌తో కలిసి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో ప్యాసెంజర్లు తమ రైలు స్టేటస్ ని , పీఎన్ఆర్ వివరాలను వాట్సాప్‌ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది.ఇక వాట్సాప్‌ ద్వారా PNRని ఎలా చెక్ చేయాలంటే..మీరు ముందుగా మీ మొబైల్‌లో రైలోఫీ నంబర్ 9881193322 ని సేవ్ చేసుకోవాలి.తరువాత ఈ నెంబర్‌ను సేవ్ చేసిన తరువాత మీ వాట్సాప్ ని ఓపెన్ చేయాలి.ఇక వాట్సాప్ ఓపెన్ చేసిన తరువాత కాంటాక్ట్స్ లిస్ట్ ఓపెన్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేయాలి. ఇంకా ఆ తరువాత మీ వాట్సాప్‌లో సేవ్ చేసిన నెంబర్‌ను మీరు సెర్చ్ చెయ్యాలి.


ఇంకా చాట్ విండో తెరిచిన తరువాత.. మీరు మీ 10 అకెంల PNR నెంబర్‌ను ఎంటర్ చేసి ఆ తరువాత సెండ్ చేయాలి.ఇక ఆ తరువాత రైలోఫీ చాట్‌బాట్‌లో మీ ట్రావెలింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తుంది. ట్రైన్ రియల్ టైమ్ లొకేషన్ ఇంకా అలాగే నోటిఫికేషన్స్ అన్ని వివరాలను కూడా తెలియజేస్తుంది.ఇంకా అలాగే ఫోన్ కాల్, మెసేజ్ కూడా చేయొచ్చు..అందుకు PNR స్టేటస్‌ని స్మార్ట్ ఫోన్ ద్వారా 139 నెంబర్‌కు కాల్ చెయ్యాలి. అలా కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు.ఇంకా అలాగే.. 139, 5676747 నెంబర్లకు మెసేజ్ సెండ్ చేయడం ద్వారా కూడా PNR స్టేటస్‌ని మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే irctc జూప్ చాట్‌బాట్ ద్వారా రైలు ప్రయాణంలో ఆన్‌లైన్‌లో ఆహారాన్ని కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. అయితే దీని కోసం ప్రయాణికులు +91 7042062070 సేవ్ చేసుకుని, వాట్సాప్ తో ఈ ఫుడ్ ఆర్డర్ సౌకర్యాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక వాట్సాప్ ద్వారా రెస్టారెంట్‌లను ఎంచుకుని, ఫుడ్ డెలివరీ కోసం రాబోయే స్టేషన్‌ను మీరు సెలక్ట్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: