ఈ-పాస్‌బుక్: పోస్ట్ ఆఫీస్ హోల్డర్స్ కి శుభవార్త?

Purushottham Vinay
పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం వలన అనేక రకాల పోస్టాఫీసు స్కీమ్‌ల ప్రయోజనాలను పొందుతారు. మీరు వాటిని పొందినట్లయితే ఈ సమాచారం మీకు చక్కటి శుభవార్త. పోస్టాఫీసు తన సేవింగ్స్ బ్యాంక్ స్కీమ్ కోసం ఈ-పాస్‌బుక్ సౌకర్యాన్ని స్టార్ట్ చేసింది.ఇక ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తర్వాత పోస్టాఫీసు సేవింగ్స్ హోల్డర్స్ తమ పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ పాస్‌బుక్‌ను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయగలరు. ఈ ఇ-పాస్‌బుక్ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తర్వాత పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ స్కీమ్ అనేది మరింత డిజిటల్‌గా మారుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే అకౌంట్ హోల్డర్స్ తమకు నచ్చిన కాలానికి లావాదేవీల స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవచ్చు.ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ వారి అకౌంట్ డీటెయిల్స్ ని స్వయంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వారు దాని కోసం పోస్టాఫీసుకు వెళ్లవలసిన పని కూడా లేదు.


అందువల్ల ఈ ‘ఈ-పాస్‌బుక్ సౌకర్యం’ ప్రారంభించిన తర్వాత పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ కేవలం మినీ స్టేట్‌మెంట్‌కు బదులుగా వారి మొత్తం బ్యాంక్ పాస్‌బుక్‌కు ప్రాప్యతను కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితిలో కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా దీన్ని ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు. మరోవైపు ఇండియా పోస్ట్ కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తమ అకౌంట్ యాక్సెస్ చేయవచ్చు. అయితే పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ ను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి మీరు తప్పనిసరిగా రిజిస్టర్డ్ నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ కలిగి ఉండాలి.ఇంకా అలాగే ఇది కాకుండా కస్టమర్‌లు ఎలాంటి సమస్య ఉన్నా కస్టమర్ కేర్ నంబర్‌కు మీరు కాల్ చేయవచ్చు. మీరు టోల్ ఫ్రీ నంబర్ 1800-425-2440కి కాల్ చేయడం ద్వారా మీ అకౌంట్ సంబంధిత సమాచారాన్ని పొందవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఇంకా అలాగే ఇది కాకుండా మీరు dopebanking@indiapost.gov.inకి కూడా మెయిల్ అనేది చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: