క్రెడిట్ కార్డ్‌తో యూపీఏ పేమెంట్ ఎలా చేయాలి?

Purushottham Vinay
ఆన్‌లైన్ చెల్లింపుల కారణంగా ప్రజలు సౌకర్యంగా వున్నారు. డిజిటల్ లేదా ఆన్‌లైన్ చెల్లింపులు చేయడానికి మీకు ఖచ్చితంగా కూడా యూపీఐ ఐడీ అనేది చాలా అవసరం. ఇది లేకుండా మీరు ఎలాంటి లావాదేవీలు చేయలేరు. ఇప్పుడు దీని దృష్ట్యా, యూపీఐ క్రెడిట్ కార్డ్‌కి కూడా లింక్ చేయబడింది. అంటే, మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి యూపీఐ చెల్లింపు కూడా చేయవచ్చు . ఇంతకుముందు ఈ సదుపాయం లేదు. బ్యాంకు ఖాతాకు లింక్ చేయడం ద్వారా మాత్రమే దీనిని పొందవచ్చు. క్రెడిట్ కార్డ్ సహాయంతో.. మీరు యూపీఐ చెల్లింపు చేసేటప్పుడు కూరగాయలు, బట్టలు, గృహోపకరణాలు, మొబైల్, ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొదలు ఏదైనా వస్తువు షాపింగ్ మాల్ నుంచి కొనుగోలు చేయవచ్చు.ఇంతకుముందు బ్యాంక్ యూపీఐ తో ఖాతాను లింక్ చేయడం ద్వారా చెల్లింపును అనుమతించేది. కానీ తరువాత యూపీఐ చెల్లింపులను మరింత ప్రముఖ్యత కల్పించింది. వినియోగదారుడికి మరింత ఫ్రెండ్లీగా మార్చేందుకు క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను కూడా జోడించింది. క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ చెల్లింపు చేయడానికి, మీరు దానిని మొబైల్ నంబర్ సహాయంతో యూపీఐకి లింక్ చేయాలి.
2022 సంవత్సరం ద్వితీయార్థంలో యూపీఐని RuPay క్రెడిట్ కార్డ్‌లతో లింక్ చేస్తున్నట్లు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సదుపాయం వీసా, మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డ్‌లలో ఇవ్వబడుతోంది. వివిధ బ్యాంకులతో క్రెడిట్ కార్డ్‌ని కనెక్ట్ చేయడం ద్వారా మీరు యూపీఐ చెల్లింపు ఎలా చేయాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


మీది hdfc బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో బీహెచ్ఏఎం యూపీఏ ద్వారా చెల్లింపును చేయండి.ఇప్పుడు 6 అంకెల యాప్ పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, ‘సెండ్ మనీ’ ఎంపికను ఎంచుకోండి.ఆ తర్వాత, లబ్ధిదారు ఖాతా నంబర్, ఎఫ్ఎస్‌సీ కోడ్ -యూపీఏ ఐడీ ద్వారా చెల్లించే ఎంపికను ఎంచుకోండి.ఇప్పుడు మొబైల్ నంబర్,ఎంఎంఐడీని నమోదు చేయండి. మొత్తంతో పాటు 4 అంకెల UPI PIN నంబర్‌ను నమోదు చేయడం ద్వారా చెల్లింపు చేయండి.


ఎస్‌బీఐ కార్డ్ అయితే sbi కార్డ్ లేదా మొబైల్ యాప్‌లో ‘paynet’ ఛానెల్‌కి వెళ్లండి.ఇప్పుడు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేసి, చెల్లించాల్సిన మొత్తాన్ని జోడించండి. యూపీఏ ఎంపికను ఎంచుకోండి.దీని తర్వాత మీరు ఇప్పుడు యూపీఏ పేజీకి వెళ్లి, ‘ఎంటర్ యువర్ వీపీఏ’ లేదా ‘స్కాన్ QR కోడ్’ ఎంపికను ఎంచుకోండి.ఇప్పుడు యూపీఏ యాప్‌తో పాటు వీపీఏ హ్యాండిల్, QR కోడ్‌ను అందించాలి.చెల్లింపు మోడ్‌ను ధృవీకరించండి. ఇప్పుడు మీరు చెల్లింపు నిర్ధారణ సందేశాన్ని కనిపిస్తుంది.చెల్లింపు పూర్తయిన తర్వాత.. ఆ సమాచారం క్రెడిట్ కార్డ్ ఖాతాకు పంపబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: