ఎయిర్‌ ఏషియా: ప్రయాణికులకు బంపర్ ఆఫర్?

Purushottham Vinay
చాలా మందికి విమాన ప్రయాణం చెయ్యడం అనేది ఒక కల. కానీ బడ్జెట్ కారణంగా ఆ కోరికను కొంతమంది నెరవేర్చుకోలేరు.ఫేమస్ విమాన కంపెనీ ఎయిర్‌ ఏషియా కంపెనీ భారీ ఆఫర్ ప్రకటించింది.ఏకంగా మొత్తం 50 లక్షల మంది ప్రయాణికులకు ఉచితంగా విమనా టిక్కెట్లను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.సరసమైన టిక్కెట్లను అందించడంలో ఎయిర్‌లైన్ పరిశ్రమలో ఎయిర్‌ ఏషియా ముందంజలో ఉంది. ఈ క్రమంలో ఉచిత టిక్కెట్లకు సంబంధించిన సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో కూడా ఉంచింది. ఈ ఉచిత టిక్కెట్ ఆఫర్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 25న ముగుస్తుందని ఈ విమానయాన కంపెనీ వెల్లడించింది.ఈ ఆఫర్ చాలా ఆసియా దేశాల ప్రయాణాలకు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే దీనిని వినియోగించుకోవాలనుకునే వారు జనవరి 1, 2023 నుంచి అక్టోబర్ 28, 2023 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కింద అందిస్తున్న 50 లక్షల టిక్కెట్ల ఉచిత సీట్ల విక్రయం ఆఫర్ వెబ్‌సైట్, యాప్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.


కంపెనీ నిర్ణయించిన గమ్యస్థానాల్లో బ్యాంకాక్  నుంచి కరాబి, ఫుకెట్‌లకు నేరుగా విమానాలు, అలాగే బ్యాంకాక్ నుంచి ఛాంగ్ మై, సకోన్‌కు నేరుగా విమానాలు ఉన్నాయి. సకోన్ నకోర్న్, నకోర్న్ శ్రిమ్మరట్, నాత్రంగ్, లౌంగ్ ప్రబంగ్, మడలయ్, ఫమ్, పెనాంగ్తో పాటు ఇతర గమ్యస్థానాలకు ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.ఇక ఎయిర్‌ ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరెన్ చాన్ మాట్లాడుతూ "అతిపెద్ద ఉచిత సీట్ల ఆఫర్ కోసం మాకు మద్దతునిచ్చిన ప్రయాణీకులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనకు ఇష్టమైన ఎన్నో గమ్యస్థానాలను రీలాంచ్ చేశాము. దీనితో పాటు కొత్త అధిక విలువ, ఇష్టమైన ఉత్తేజకరమైన గమ్యస్థానాలకు కూడా విమానాలు ప్రారంభించబడతాయి." అని అన్నారు.కాబట్టి విమాన ప్రయాణం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఆఫర్ ఉపయోగించుకోండి.ఫ్రీగా టికెట్ పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: