యూపీఐ ద్వారా రోజుకి ఎంత డబ్బు పంపొచ్చు?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో యూపీఐ యాప్స్ అనేవి జనాలకు వరంలా మారాయి. వీటి వల్ల జనాల సమయం చాలా ఆదా అవుతుంది. అందుకే ఈ యాప్స్ ని చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల క్షణాల్లో ఇతరులకు డబ్బులు పంపొచ్చు.ఇంకా డబ్బు రిసీవ్ చేసుకోవచ్చు.ఇక గత ఆగస్ట్ నెలలో యూపీఐ లావాదేవీలు ఏకంగా 657 కోట్లు దాటేశాయి. అంటే యూపీఐ వినియోగం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్‌పీసీఐ ఈ యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చింది. ఐఎంపీఎస్  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దీన్ని రూపొందించారు. క్షణాల్లో ఇతరులకు డబ్బులు పంపొచ్చు. ఇతర లావాదేవీలు నిర్వహించొచ్చు.మార్కెట్‌లో ప్రస్తుతం చాలా రకాల యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే, భీమ్ యూపీఐ వంటి యాప్స్‌ను ఉపయోగించొచ్చు. లేదంటే బ్యాంకులు కూడా వాటి సొంత యూపీఐ యాప్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని కూడా వాడొచ్చు. మీరు ఏ యాప్ ఉపయోగించినా కూడా యూపీఐ సేవలు చాలా వేగంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ మాత్రం యూపీఐ ట్రాన్సాక్షన్లకు లిమిట్ ఉంచాయి. మినిమమ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. గరిష్ట పరిమితి మాత్రం రూ. 2 లక్షల వరకు ఉంది. అలాగే బ్యాంకులు వాటి కస్టమర్లకు సొంత లిమిట్స్‌ను కూడా సెట్ చేయొచ్చు. అందుకే ఒక్కో బ్యాంక్‌లో లిమిట్ ఒక్కోలా ఉంటుంది.


ఎస్‌బీఐ , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు అయితే రోజుకు రూ. లక్ష వరకు డబ్బులు పంపొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు రోజుకు రూ. 25 వేల వరకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఆంధ్రాబ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు రూ.లక్ష వరకు పంపొచ్చు. కెనరా బ్యాంక్ లిమిట్ రోజుకు రూ. 25 వేలుగా ఉంది. దేనా బ్యాంక్, సిటీ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర కస్టమర్లు కూడా రూ.లక్ష వరకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు అయితే రోజుకు రూ. 50 వేలు పొందొచ్చు.బ్యాంకుల యూపీఐ రోజూ వారి లిమిట్ ఒకలా ఉంటుంది. అలాగే ఒకే సారి ఎంత డబ్బులు పంపొచ్చు అనేది ఒకలా ఉంటుంది. అంటే రోజుకు రూ. లక్ష వరకు పంపొచ్చని ఉంటుంది. అయితే ఒకేసారి రూ.లక్ష పంపడం వీలు కాదు. ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది తక్కువగా ఉండొచ్చు. అందువల్ల యూపీఐ లిమిట్ అనేది రెండు రకాలు ఉంటుందని తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు ఒకేసారి రూ.లక్ష వరకు పంపే వెసులుబాటు కల్పిస్తూ ఉంటాయి. మరికొన్ని బ్యాంకులు తక్కువ ట్రాన్సాక్షన్ లిమిట్ పెడతాయి.కాబట్టి అది గమనించి లావాదేవీలు చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

UPI

సంబంధిత వార్తలు: