TCS: ఉద్యోగులకు గుడ్ న్యూస్?

Purushottham Vinay
ఇక ఇండియాలోని ఐటీ కంపెనీలలో దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో నెంబర్ వన్ కంపెనీగా దూసుకుపోతుంది. తన ఉద్యోగులకు అనుకూలంగా ఎన్నో రకాల బెనిఫిట్స్ ని అందిస్తూ లాభాలతో దూసుకుపోతుంది.వారి ప్రతిభకు తగ్గట్టు జీతాలు పెంచి వారికి ఎల్లవేళలా తోడు నిలుస్తుంది. మొత్తంగా చెప్పాలంటే tcs లో ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబ్ లాంటిది. ఇక తాజాగాతన ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ తెలిపింది. తమ సంస్థలో పనిచేస్తున్న 6 లక్షలకు పైగా టెక్కీలకు వేరియబుల్ పరిహారాన్ని 100% చెల్లిస్తామని పేర్కొంది.టాటా గ్రూప్ కంపెనీ C3A, C3B, C4, సమానమైన గ్రేడ్‌ల కోసం వేరియబుల్ చెల్లింపును ఒక నెల ఆలస్యం చేసినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే జూలై నెలలో చెల్లించాల్సిన ఈ వేరియబుల్ సొమ్మును ఆగస్ట్-చివరి నాటికి చెల్లించటం జరుగుతుందట.అసిస్టెంట్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ స్థాయి ఉద్యోగులకు దీనికి సంబంధించి కంపెనీ ఈ-మెయిల్ ద్వారా ఈ వివరాలు తెలిపినట్లు సమాచారం.దేశంలోని wipro, INFOSYS వంటి ఇతర IT కంపెనీలు వేరియబుల్ వేతనాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో టీసీఎస్ ఉద్యోగులకు తీపికబురు తెలిపింది. 


ముఖ్యంగా కార్యకలాపాల మార్జిన్‌లో క్షీణత కనిపించిన తర్వాత విప్రో తన ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని తగ్గించాలని నిర్ణయించినట్లు ప్రకటన చేసింది. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేరియబుల్ పేలో సగటున 70 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సాంకేతికతలో పెట్టుబడులు, ఉద్యోగుల కొరత, మార్జిన్ ఒత్తిడి వంటి కారణాల వల్ల విప్రో ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని ఆలస్యం చేసింది.వేరియబుల్ పే అంటే ఏంటంటే పనితీరు, సంస్థ పెరుగుదల పురోగతికి సహకారం ఆధారంగా ఉద్యోగులకు యజమాని చెల్లించే పరిహారం. ఇది ఉద్యోగులకు మూడునెలలకు ఒకసారి కంపెనీలు చెల్లిస్తుంటాయి. ఉద్యోగులు జీతంలో ఇవి కూడా ప్రధాన భాగంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: