బిజినెస్: కేవలం 35 వేల పెట్టుబడి.. లక్షకు పైగా లాభాలు?

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో సొంతంగా వ్యాపారాన్ని  ప్రారంభించుకోవాలనుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది.ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం మేలు అని అనేక మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా సొంతంగా వ్యాపారాన్ని  ప్రారంభించుకోవాలని భావిస్తే.. ఇక మీకోసం ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా. ఇక అదే తేనెటీగల పెంపకం. ఈ వ్యాపారం ద్వారా మీరు చాలా డబ్బు సంపాధించుకోవచ్చు. ఇంకా ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, కేంద్ర ప్రభుత్వం సైతం మీకు ఆర్థిక సహాయం అందిస్తుంది. అలాగే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనేక రాష్ట్రాలు సబ్సిడీని కూడా ఇస్తున్నాయి. ఇది గ్రామంలో లేదా నగరంలో ఎక్కడైనా కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. తేనె ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలు కూడా ఆర్జించవచ్చని నిపుణులు చెబుతున్నారు.వ్యవసాయం ఇంకా రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పంట ఉత్పాదకతను మెరుగుపరచడానికి తేనెటీగల పెంపకం అభివృద్ధి పేరుతో ఒక కేంద్ర పథకాన్ని కూడా ప్రారంభించింది.


ఇక ఈ పథకం  లక్ష్యం తేనెటీగల పెంపకం రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉత్పాదకతను పెంచడం, శిక్షణ ఇంకా అవగాహన కల్పించడం. ఇక నేషనల్ బీ బోర్డ్  నాబార్డ్‌తో కలిసి భారతదేశంలో తేనెటీగల పెంపకానికి ఆర్థిక సహాయం అందించే పథకాలను కూడా ప్రారంభించింది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ప్రభుత్వం మొత్తం 80 నుండి 85 శాతం సబ్సిడీని అందిస్తుంది.ఇక మీకు కావాలంటే, మీరు 10 పెట్టెలతో కూడా తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఒక పెట్టెలో 40 కిలోల తేనె కనుక లభిస్తే మొత్తం తేనె 400 కిలోలు అవుతుంది. 400 కిలోలను కిలో రూ.350 చొప్పున కనుక విక్రయిస్తే రూ.1.40 లక్షల ఆదాయం వస్తుంది. ఒక్కో పెట్టె ఖర్చు రూ.3500 వరకు కూడా ఉంటుంది. అంటే మొత్తం ఖర్చు వచ్చేసి రూ.35,000 కాగా నికర లాభం రూ.1,05,000 గా ఉంటుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బిజినెస్ పై ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: