శుభవార్త : అందుబాటులోకి ఆధార్‌ ఫేస్‌ ఆర్డీ యాప్‌!

Purushottham Vinay
ఇక ఇటీవల దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందన్న కారణంతో ఆధార్‌ వివరాల్ని ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వకూడదంటూ ఆదార్‌ 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ' (యూఐడీఎఐ) చాలా అప్రమత్తం చేసింది. కొన్ని సంస్థలకే ఆధార్‌ వివరాలు సేకరించే లైసెన్స్‌ ఇచ్చామనీ ఇక ఆ లైసెన్స్‌ లేని సంస్థలు ఆధార్‌ అడిగితే (ఆధార్‌ నంబర్‌లో చివరి నాలుగంకెలు మాత్రమే కనిపించే) 'మాస్క్‌డ్‌ ఆధార్‌'ను ఇవ్వాలనీ కూడా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఆధార్‌లో ఫేస్‌ అథంటికేషన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు ఆధార్‌ సంస్థ సోషల్ మీడియా ద్వారా చేసింది.ఇక స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు ముందుగా గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి అందులో ఆధార్‌ ఫేస్‌ ఆర్డీ యాప్‌ అని సెర్చ్‌ చేయాలి. ఇంకా గూగుల్‌ ప్లేస్టోర్‌లో సెర్చ్‌ చేస్తే మీకు ఆధార్‌ ఫేస్‌ ఆర్డీ యాప్‌ అనేది కనబడుతుంది. దానిపై క్లిక్‌ చేసి ఇన్‌స్టాల్‌ ఆప్షన్‌పై మీరు ట్యాప్‌ చేయాలి. తరువాత మీరు ఫేస్ అథంటికేషన్ పూర్తి చేసుకోవడానికి స్క్రీన్‌పై కొన్ని నిబంధనల్ని తప్పని సరిగ్గా పాటించాల్సి ఉంటుంది.ఆ తరువాత ప్రోసీడ్‌పై మీరు క్లిక్ చేయండి.


ఇక ఫేస్ అథంటికేషన్ సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే ముందుగా మీ కెమెరా లెన్స్‌లు ఖచ్చితంగా క్లీన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు లైటింగ్ ఉన్న చోట సరిగ్గా నిలుచోండి. ఇంకా అలాగే ఖచ్చితంగా మీ బ్యాక్‌గ్రౌండ్ కూడా క్లియర్‌గా ఉండేలా చేసుకోండి.ఇంకా అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలైన జీవన్ ప్రమాణ్, పీడీఎస్, స్కాలర్‌షిప్ స్కీమ్స్, కోవిన్ ఇంకా ఫార్మర్ వెల్ఫేర్ స్కీమ్స్ వంటి వాటిల్లో అప్లయ్‌ చేయాలంటే కొన్ని సార్లు ఫిజికల్‌ ఆధార్‌ కార్డ్‌ను తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. ఇకపై అలా కాకుండా కేవలం మొబైల్‌లోని యాప్‌తో ఆధార్‌ ఫేస్‌ అథంటికేషన్‌తో మీరు పూర్తి చేసుకోవచ్చు.ఇక అంతేకాదు ఆధార కార్డు దారులు వారి వ్యక్తిగత డేటాను ఫేస్ అథంటికేషన్ కోసం సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో స్టోర్ చేసుకోవచ్చని కూడా యూఐడీఏఐ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: