క్రెడిట్ కార్డ్ : యూజర్లకు గుడ్ న్యూస్?

Purushottham Vinay
ప్రతీ నెలా కూడా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తున్నారా? క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించే తేదీ గుర్తుంచుకోకపోతే ఖచ్చితంగా చిక్కులు తప్పవు.ఇక గడువు దాటిన తర్వాత బిల్ చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. అందుకే క్రెడిట్ కార్డ్ బిల్ విషయంలో చాలా అలర్ట్‌గా ఉండాలి. అయితే క్రెడిట్ కార్డ్ యూజర్లు బిల్ పేమెంట్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఇందుకు కారణం బిల్ జనరేట్ అయ్యే డేట్. బిల్ జనరేట్ అయిన 20 రోజుల్లో క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా బిల్ చెల్లించకపోతే పెనాల్టీ ఇంకా వడ్డీ భారం పడుతుంది. ఇక ఒకసారి బిల్లింగ్ సైకిల్ ఫిక్స్ అయిందంటే ఆ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ అయ్యేవరకు అందులో మార్పు ఉండదు.ఉదాహరణకు ఓ వ్యక్తి ఏదైనా ఓ బ్యాంకులో కనుక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకుందాం. ప్రతీ నెల కూడా 5వ తేదీన బిల్ జనరేట్ అవుతుంది. అది 5న బిల్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇక ఆ తర్వాత బిల్ పేమెంట్ చేయడానికి 20 రోజుల సమయం ఉంటుంది. అంటే ఆ నెల 25వ తేదీన బిల్ ని చెల్లించాలి. అంటే మంత్ ఎండింగ్‌లో బిల్ ని చెల్లించాల్సి ఉంటుంది. వేతనాలు పొందే ఉద్యోగులకు మంత్ ఎండ్ వచ్చేసరికి డబ్బులకు ఇబ్బంది ఉండటం అనేది మామూలే. అందువల్ల అలాంటి సమయంలో క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించడం అంటే సాధ్యమయ్యే పనికాదు. ఇక ఇందుకోసం అప్పు చేయాల్సి ఉంటుంది.


క్రెడిట్ కార్డ్ యూజర్లు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇది.బిల్ జనరేట్ అయ్యే తేదీని మార్చాలని యూజర్లు రిక్వెస్ట్ చేసినా కూడా బ్యాంకులు పట్టించుకోవు. దీంతో క్రెడిట్ కార్డ్ యూజర్లు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1 వ తేదీ నుంచి కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక ఈ రూల్ ప్రకారం క్రెడిట్ కార్డ్ యూజర్లు తమ బిల్లింగ్ సైకిల్ ఒకసారి మార్చుకోవచ్చు. అంటే ఇక క్రెడిట్ కార్డ్ యూజర్లు తమకు అనుకూలంగా ఉండే తేదీలో బిల్ చెల్లించేందుకు బిల్లింగ్ సైకిల్ మార్చాలని బ్యాంకును కోరొచ్చు. ఈ అవకాశం అనేది కేవలం ఒకసారి మాత్రమే ఉంటుంది. ఇక ఆర్‌బీఐ నిబంధనలు ప్రకారం క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థలు ఇకపై స్టాండర్డ్ బిల్లింగ్ సైకిల్ పాటించకుండా ఇంకా కస్టమర్లు సొంతగా బిల్లింగ్ పీరియడ్ ఎంచుకునేలా అనుమతి ఇవ్వాలి.ఇక ఇలా క్రెడిట్ కార్డ్ యూజర్లు తమకు అనుకూలంగా ఉండేలా బిల్లింగ్ సైకిల్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈ వెసులుబాటును ఉపయోగించుకొని క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించాలన్న ఒత్తిడి ఈజీగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: