క్రెడిట్ కార్డ్ ఇలా వాడితే మీకు తిప్పలు తప్పవు!

Purushottham Vinay
ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డ్ వినియోగం అయితే అసలు బాగా పెరిగిపోయింది. ఇక ఆన్‌లైన్ షాపింగ్  నుంచి పేమెంట్స్ వరకు కూడా క్రెడిట్ కార్డ్ ఎక్కువగా వాడుతున్నారు. క్రెడిట్ కార్డుపై 20 రోజుల నుంచి 60 రోజుల వరకు ఇంటరెస్ట్ ఫ్రీ అంటే వడ్డీలేకుండా చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని క్రెడిట్ కార్డులపై 90 రోజుల వరకు కూడా అసలు పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డ్ తీసుకునేందుకు చాలా మంది కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. డబ్బులు ఉన్నా కూడా క్రెడిట్ కార్డుతో లావాదేవీలు చేసి, తమ దగ్గర ఉన్న డబ్బుల్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తం వాడేస్తే ఖచ్చితంగా చిక్కులు తప్పవు. అది మీ క్రెడిట్ స్కోర్‌ను బాగా దెబ్బతీస్తుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.ఇక మీరు ప్రతీ నెలా కూడా మీ క్రెడిట్ లిమిట్‌ను మొత్తం వాడేస్తుంటే మీరు డిఫాల్ట్ చేయొచ్చన్న అనుమానంతో బ్యాంకులు మీ క్రెడిట్ లిమిట్‌ను తగ్గించే అవకాశం చాలా ఉంది. క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించే విషయంలో క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో నియమాలు పాటించాలని కూడా చెబుతుంటారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్.


క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది అసలు ఎంత ఉంటే అంత వాడకూడదని అంటారు. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో మొత్తం 30 శాతం ఉండాలి. అంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చేసి రూ.1,00,000 ఉంటే మీరు అందులో 30 శాతం అంటే కేవలం రూ.30,000 మాత్రమే వాడుకోవాలి.ఇక అంతకన్నా ఎక్కువ వాడితే మీ క్రెడిట్ స్కోర్ పైన కూడా ప్రభావం పడుతుంది. మీరు ఎంత ఎక్కువ వాడితే అంత క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది.క్రెడిట్ స్కోర్ కనుక తగ్గితే మీరు భవిష్యత్తులో రుణాలకు అప్లై చేసినప్పుడు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను బట్టి మీ క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువగా మారుతూ ఉంటుంది. మీరు మీ క్రెడిట్ లిమిట్‌ను ఎక్కువగా వాడుతున్నారంటే మీరు ఎక్కువగా అప్పు చేస్తున్నారని కూడా అర్థం. అందుకే ఈ క్రెడిట్ లిమిట్ అనేది ఎక్కువగా వాడకూడదంటారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: