అదిరిపోయే బెనిఫిట్స్ తో కొత్త క్రెడిట్ కార్డు..త్వరపడండి ..

Satvika
ప్రస్తుతం ఆర్థిక సమస్యలు అందరిని వెంటాడుతున్నాయి. అందుకే చాలా మంది క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. అవసరానికి వాడుకొని తర్వాత నెలకు బిల్ పే చేయాల్సి వస్తుంది. దాంతో వీటి వినియోగం రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది. ఇక వినియోగ దారులను పెంచుకొనే ప్రయత్నం కూడా ఆయా బ్యాంకులు చేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఇప్పుడు మరో కొత్త క్రెడిట్ కార్డు మార్కెట్ లోకి వచ్చిందని అంటున్నారు. ఆ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయట. ముఖ్యంగా క్యాష్ బ్యాక్. ఆలస్యం చేయకుండా ఆ కార్డు ఏంటి? ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం..

ప్రస్తుతం స్లైస్‌ కార్డు వినియోగదారుల కు అందుబాటు లో క్యాష్ బ్యాక్‌, ఆఫర్లు ఉన్నాయి. లింక్డ్‌ఇన్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తీసుకుంటే వంద రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చునట.. ఈ కార్డు ద్వారా 500 పెట్టి రైలు టికెట్ ను బుక్ చేస్తే 75 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందవచ్చునట. ఫోన్‌పే లో స్లైస్‌ కార్డు లో చేసే కొనుగోళ్ల పై 50 క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నారు. అయితే అందులో 400 లకు పైగా కొంగలు చేయాల్సి ఉందట. ఫ్లిప్‌కార్ట్‌లోనూ మంచి ఆఫర్లు ఉన్నాయి.

ఈ కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. స్లైస్‌ యాప్‌ ను మీ మొబైల్‌ లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అందులో అడిగే వ్యక్తిగత విషయాల ను పొందుపరచాలి. పాన్‌ కార్డు వివరాలను బట్టి మీకు క్రెడిట్‌ లిమిట్‌ కేటాయిస్తారు. అక్కడ వచ్చిన స్కోర్ ను బట్టి మామూలు కార్డునా? లేక స్మార్ట్ కార్డా? అనేది నిర్ణయిస్తుంది.  దాని ద్వారా కార్డును పొందవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. క్యాష్ బ్యాక్.. అన్ని కార్డులతో పోలిస్తే వీటిద్వారా వేగంగా క్రెడిట్ అవుతుందట.. చూసారుగా మీకు నచ్చితే అప్లై చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: