క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్లకు మత్తైన వార్త..!

Satvika
క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి మత్తెక్కించే వార్త.. రోజుకో బ్యాంక్  కొత్త ఆఫర్లతో క్రెడిట్ కార్డును అందిస్తున్నారు.ఈ మధ్య కాలం లో వీటి వాడకం ఎక్కువ అయ్యింది. పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఉద్యోగుల కు, వ్యాపారుల కు విపరీతం గా క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ కార్డులు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే, క్రెడిట్ కార్డు వల్ల ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయని గుర్తించు కోవాలి. ఎందుకంటే, క్రెడిట్ కార్డుకు అలవాటు పడే వ్యక్తులు దాని నుంచి తొందరగా బయటపడలేరు.

అవసరం ఉన్నా, లేక పోయినా కూడా ఏదోక పనికి వాడుతుంటారు. ఎలాగంటే ఒక మత్తు లాగా ఎక్కించుకున్నారు. తాజాగా, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన అధ్యయనం లోనూ ఇదే విషయం వెల్లడైంది. అధ్యయనం ప్రకారం,సాధారణంగా నగదుకు బదులుగా కార్డును ఉపయోగించినప్పుడు ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. కోవిడ్ -19 మహమ్మారి భయాందోళన నేపథ్యం లో నగదు లావాదేవీలు తగ్గి పోవడంతో పాటు కార్డు చెల్లింపులు, ఆన్లైన్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి..

చిన్న చిన్న వస్తువులను కొనడం దగ్గరనుంచి పెద్ద షాపింగ్ ల లో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే, క్రెడిట్ కార్డులను ఇచ్చేవాళ్ళు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. కొకైన్ మాదిరి గానే మెదడు లో ఒక రియాక్షన్ని ఏర్పరుస్తుంది. మరో మాటలో చెప్పాలంటే క్రెడిట్ కార్డు వాడకం మెదడుకు కొకైన్ మాదిరి గానే కిక్ ఇస్తుంది.' అని అధ్యయనం పేర్కొంది. క్రెడిట్ కార్డులు చెల్లింపులతో వచ్చే రివార్డు పాయింట్లు, ఆఫర్లు మనల్ని మరింత ఎక్కువ కొనుగోలు చేసేలా చేస్తాయి. ఈ రివార్డు పాయింట్ల ద్వారా కావాల్సిన కిక్ వస్తుందని పరిశోధకులు వెల్లడించారు... జాగ్రత్త సుమీ వీటికి ఒక్కసారి తల దించారో.. నెల నెలా వద్దనుకున్నా వాచిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: