2025 నాటికి పూర్తిగా అంతరించిపోనున్న పెట్రోల్, డీజిల్ కార్లు!

Divya

నాటి నుంచి నేటి వరకు పెట్రోల్,డీజిల్ కార్ల హవానే నడుస్తోంది. ప్రస్తుతం ఎవరు చూసినా పేద,ధనిక అనే తేడా లేకుండా సమాజంలో మర్యాద  కోసమైనా కారు ఉండాలని ఆలోచిస్తుంటారు.అదే తడవుగా కార్ల కంపెనీలు కూడా విక్రయాలు చేసేటప్పుడు అధిక  మొత్తంలో లాభార్జన చేస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కార్ల కొనుగోలు ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఫలితంగా కొద్ది రోజుల తర్వాత మనకు పెట్రోల్, డీజిల్ కూడా దొరకని రోజులు ఏర్పడబోతున్నాయి.  భవిష్యత్తులో రాబోయే అపత్కర పరిస్థితులను ముందే ఊహించి,  పెట్రోల్, డీజిల్ కార్ల కొనుగోళ్లను నిలిపివేయాలని నార్వే దేశ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ కార్ల కొనుగోళ్లతో పాటు అధికంగా అమ్ముడుపోతున్నాయి ఎలక్ట్రిక్ కార్లు. వీటికి పెట్రోల్, డీజిల్ తో పనిలేదు. కేవలం ఎలక్ట్రిక్ తో నడుస్తాయి. ఇందుకు కారణం ఇంటర్నల్ కంబోస్టన్ ఇంజన్ లేకపోవడమే. వీటిని తొలగించి ఎలక్ట్రిక్ సిస్టంను అనుసంధానం చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ లేకుండానే కార్లు నడుస్తాయి.
ఇక 2025 వ సంవత్సరం నాటికి పూర్తిగా పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలు నిలిపివేసిన మొదటి దేశంగా నిలవాలని నార్వే నిర్ణయించుకుంది. ఇందుకు అనుగుణంగా వాటికి కావలసిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంది.  ఇప్పటికే నార్వేలో ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు విపరీతంగా పెరుగుతున్నాయి. 2019లో సంవత్సరంతో పోలిస్తే 2020 సంవత్సరంలో ప్రతి నెలకి 50 శాతం విద్యుత్ కార్ల విక్రయాలు నమోదయ్యాయి. గత డిసెంబర్ నెలలో కార్ల మార్కెట్లో విద్యుత్ కార్లది 66.7 శాతంగా నమోదైందని నార్వే ప్రభుత్వం ప్రకటించింది.
ప్రపంచంలోకెల్లా టాప్ బ్యాటరీ వెహికల్ ప్రొడ్యూసర్ గా నిలిచిన టెస్లాను సైతం జర్మనీ ఆటో మేకర్ వోక్స్ వేగన్  అధిగమించి,  నార్వేలో విద్యుత్ వాహనాలు విక్రయాలలో  రికార్డు నెలకొల్పింది. నార్వేలో వోక్స్ వేగన్  కు చెందిన ఆడి కంపెనీలో ఈ - ట్రోన్ కారు 2020 లో అత్యధికంగా అమ్ముడయ్యాయి. టెస్లా మిడ్ సైజు మోడల్-3 కారు రెండో స్థానానికి పరిమితమైంది. ఇదే స్థాయిలో విద్యుత్ కార్లను విక్రయించగలిగితే, 2025వ సంవత్సరం నాటికి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోగలమని  అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్లు  నార్వేలో అత్యధికంగా అమ్ముడుపోతే,ఇక ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఎలక్ట్రిక్ కార్లకు షిఫ్ట్ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: