క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ముఖ్య సూచనలు!

SS Marvels
డెబిట్ కార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్యాంక్ అకౌంట్ తీసుకున్నవారికి అంటే ఖాతాదారుడు తన అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి అలాగే డిపాజిట్ చేయడానికి బ్యాంక్ కి  రాకుండా ఏటీఎం సెంటర్లో వినియోగించేందుకు మినిమం ఛార్జీలతో ఏర్పాటు చేసిన అవకాశం. ఇక్కడ ఖాతాలో డబ్బు ఉంటేనే లావాదేవీలు జరుగుతాయి. కానీ క్రెడిట్ కార్డుల విషయంలో అలా కాదు. ఖాతాలో డబ్బు లేకున్నా కూడా కొంత లిమిట్ వరకు అప్పుగా డబ్బు బ్యాంక్ నుండి వాడుకొనే అవకాశం ఉంటుంది. అయితే ఇక క్రెడిట్ కార్డులతో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసు. రివార్డు పాయింట్లు, నో కాస్ట్ ఈఎంఐ, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఇన్‌స్టంట్ క్రెడిట్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. అయితే క్రెడిట్ కార్డులతో ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని తెలుసుకోవాలి.
క్రెడిట్ కార్డులను ఇష్టానుసారంగా ఉపయోగిస్తే రుణ ఊబిలో కూరుకుపోవచ్చు. క్రెడిట్ స్కోర్ దెబ్బతింటే బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందలేకపోవచ్చు. అందుకే క్రెడిట్ కార్డును ఎలా వాడినా కూడా బిల్లు మాత్రం కరెక్ట్‌గా చెల్లిస్తూ వస్తే ఏం కాదు. లేదంటే ఇబ్బందులు తప్పవు. క్రెడిట్ కార్డు బిల్లును కరెక్ట్‌ టైమ్ కట్టకపోతే ఆలస్య రుసుము చెల్లించుకోవాలి. లేట్ ఫీజు మీ నెక్ట్స్ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌కు జతవుతుంది. అంతేకాకుండా చెల్లించని డబ్బులపై అధిక వడ్డీ పడుతుంది. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అంతేకాకుండా పలు రివార్డులు కూడా కోల్పోవలసి వస్తుంది. మీరు మీ క్రెడిట్ కార్డును బిల్లును చాలా రోజులు అయినా కూడా కట్టకపోతే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కార్డు బిల్లు మొత్తాన్ని చెల్లించకపోవడం 180 రోజులు దాటితే మీ కార్డును బ్లాక్ చేస్తారు. అప్పుడు ఈ విషయం కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. క్రెడిట్ స్కోర్ బాగోలేకపోతే భవిష్యత్‌లో ఎలాంటి రుణాలు పొందలేకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: