భారీ లాభాల్లో ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్స్..!

Suma Kallamadi
భారతదేశ దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల వైపు దూసుకెళ్లాయి. మరోసారి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని రుజువు చేస్తూ 40 వేల పాయింట్ల మార్కును దాటింది. ఇక నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 446 పాయింట్లు బలపడి 40432 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 11898 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ముఖ్యంగా ఫిబ్రవరి చివరి కల్లా భారత దేశం నుండి బయటపడే అవకాశం ఉన్నట్లుగా అంచనాలు రావడంతో, అలాగే విదేశీ మార్కెట్ల కారణంగా మార్కెట్లు లాభాల వైపు నడిచాయి. ఇక నేడు నిఫ్టీ బ్యాంక్ 3 శాతం పైగా లాభపడగా నిఫ్టీ ఐటి 0.6% నష్టపోయింది. ఇక నిఫ్టీ ఆటో 1.12 శాతం నష్టపోగా, నిఫ్టీ పిఎస్ యు బ్యాంకు 2.2 శాతం లాభపడింది.

ఇక నేడు మార్కెట్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే.. అందులో ముఖ్యంగా అత్యధికంగా లాభపడిన కంపెనీల లిస్టులో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ, గైయిల్  కంపెనీలు అత్యధికంగా లాభపడ్డాయి. ఇందులో ఐసిఐసిఐ బ్యాంక్ ఏకంగా 5.3 శాతం లాభపడింది. మరోవైపు అత్యధికంగా నష్టపోయిన కంపెనీ షేర్ల విషయానికి వస్తే.. దివిస్ ల్యాబ్స్, ఐచర్ మోటార్స్, హీరో మోటార్ కార్ప్, సిప్ల, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా దివిస్ ల్యాబ్స్ 4.01 శాతం నష్టపోయింది. ఇక నేడు మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ లో డిసెంబర్ నెలకు సంబంధించి బంగారం 174 రూపాయలు బలపడి రూ. 50 ,721 వద్ద ముగిసింది. అలాగే వెండి డిసెంబర్ నెల గాను నేడు ఒక్కరోజే 889 రూపాయలు లాభపడి 62 ,565 వద్ద ముగిసింది.

నగదు విభాగంలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు 480 కోట్ల విలువైన స్టాక్స్ ను కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్ 430 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో గత వారంలో మొత్తం విదేశీ ఇన్వెస్టర్లు 1186 కోట్లను ఇన్వెస్ట్ దేశి ఇన్వెస్టర్లు 5217 కోట్ల విలువైన షేర్లను అమ్మకాలు చేపట్టారు. వివిధ కంపెనీలు వారి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడం కారణంగా కాస్త మార్కెట్ ఒడిదుడుకులకు లోనవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: