మళ్లీ లాభాల పట్టిన స్టాక్ మార్కెట్స్...!

Suma Kallamadi

గురువారం నాడు భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు నేడు మళ్ళీ తిరిగి లాభాల బాట పట్టాయి. వరుసగా పది దినాలు లాభాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లకు నిన్న గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేడు ఒకవైపు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న కానీ మరోవైపు భారతీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల వైపు పరుగులు పెట్టాయి. ఇక దేశీయ మార్కెట్ లో నేడు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 254 పాయింట్లు బలపడి 39 982 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 82 పాయింట్ బలపడి 11762 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నేడు నిఫ్టీ లో నిఫ్టీ బ్యాంకు రెండు శాతం మేర లాభపడగా, నిఫ్టీ ఐటీ నష్టపోయింది. అలాగే నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఎఫ్ఎంసిజి, నిఫ్టీ ఫార్మా రంగాలు లాభాల బాట పట్టాయి

ఇక నేడు నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే ముందుగా లాభపడిన కంపెనీ షేర్లు చూస్తే..  జెఎస్డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్ , బిపిసిఎల్, దివిస్ ల్యాబ్స్, హిందాల్కో కంపెనీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా జెఎస్డబ్ల్యు స్టీల్ 6.69 శాతం పైగా లాభాలలో ముగిసింది. ఇక మరోవైపు నష్టాల విషయానికి వస్తే యుపిఎల్, హెచ్సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ రిలయన్స్ కంపెనీల షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా యుపిఎల్ కంపెనీ షేర్లు 7.82% నష్టాల బాట పట్టింది.

ఇక హైదరాబాద్ లో బంగారం వెండి ధర విషయానికి వస్తే స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 190 రూపాయల పెరిగి రూ. 52 ,940 వద్ద ముగియగా.. 22 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు పెరిగి రూ. 48 ,530 ముగిసాయి. ఇక మరోవైపు వెండి కూడా కేజీ 600 రూపాయలు పెరిగి చివరగా రూ. 61,600 గా ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: