వరుసగా పదవరోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్...!

Suma Kallamadi
దేశీ స్టాక్ మార్కెట్స్ లాభాలలో కొనసాగుతూనే ఉంది. గత పది రోజుల నుంచి నష్టాలు లేకుండా లాభాల్లోనే ముగిస్తూ వస్తుంది. ఇక తాజాగా నేటి ఉదయం కాస్త నష్టాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు మార్కెట్ ముగిసే సమయానికి మాత్రం మంచి లాభాలలో ముగిశాయి. దీనితో వరుసగా 10 వ రోజు మార్కెట్ లాభాలలో ముగిసాయి. నేడు ఉదయం మొదలైన సూచీలను బట్టి నేడు కచ్చితంగా నష్టాల్లో భావించిన వారందరికీ బ్యాంక్ షేర్స్ ఊహించని విధంగా లాభాల్లోకి దూసుకెళ్లి మార్కెట్ ను లాభాల వైపు నడిపించాయి. ఇక మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 165 పాయింట్లు బలపడి 40794 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 36 పాయింట్లు బలపడి 11971 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నేడు బ్యాంక్ ఎఫ్ఎస్సి జి, మెటల్ రంగాలు లాభాల బాట పట్టగా మిగతా రంగాల్లో అన్ని కూడా నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీ షేర్లు బాగా దెబ్బతీశాయి.

ఇక నేడు ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 లాభనష్టాల విషయానికి వస్తే.. నేడు అత్యధికంగా లాభపడిన వాటిలో బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇందుస్ ల్యాండ్ బ్యాంక్ అత్యధికంగా లాభపడిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా బజాజ్ ఫిన్ సర్వ్ 4 శాతం మేర లాభపడింది. ఇక అదే విధంగా నష్టపోయిన కంపెనీ షేర్ల విషయానికి వస్తే విప్రో, ntpc, ongc, కోల్ ఇండియా, టాటా మోటార్స్ కంపెనీ లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇందులో విప్రో కంపెనీ అత్యధికంగా 7 శాతం మేర నష్టపోయింది.

ఇక నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 320 రూపాయలు తగ్గి రూ. 52 ,770 వద్ద ముగియగా.. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయలు తగ్గి రూ. 48, 380 వద్ద ముగిసింది. బంగారం తో పాటు వెండి కూడా తగ్గుముఖం పట్టింది. మార్కెట్ ముగిసే సమయానికి హైదరాబాద్ మార్కెట్లో కేజీ బంగారం ధర ఏకంగా 1700 రూపాయలు తగ్గి రూ. 60,900 కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: