ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు...!

Suma Kallamadi
నేడు దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా తొమ్మిదో రోజు లాభాలలో ముగిసాయి. ఉదయం ప్రారంభ సమయంలో భారీ లాభాలను చూసిన మార్కెట్లో ఆ తర్వాత మధ్యాహ్నానికి అమ్మకాలు పెరగడం తో నష్టాల వైపు నడిచాయి. దీనీతో మొదటి లో వచ్చిన లాభాల కాస్త పూర్తిగా ఆవిరైపోయాయి. ఇక మార్కెట్ సమయం ముగిసే సమయానికి సెన్సెక్స్ 31.7 పాయింట్లు లాభపడగా చివరికి 40625 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా కేవలం మూడు పాయింట్లు బలపడి 11934 వద్ద ముగిసింది.
ఇక నిఫ్టీ సెక్టోరల్ విషయానికి వస్తే నిఫ్టీ ఫార్మా భారీగా నష్టపోయింది. అలాగే నిఫ్టీ ఆటో, బ్యాంకింగ్, fmcg రంగాలలో అమ్మకాలు పెరగడంతో నష్టాల్లో ముగిసాయి. ఇకపోతే ఐటీ, మెటల్ రంగాలలో కాస్త కొనుగోలు కనిపించింది. ఇక నేడు నిఫ్టీ 50 లాభనష్టాల విషయానికి వస్తే.. ముందుగా అత్యధికంగా లాభపడిన కంపెనీల లిస్ట్ చూస్తే.. హెచ్ సి ఎల్ టెక్, mahindra BANK' target='_blank' title='కొటక్ మహీంద్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు అత్యధికంగా లాభాల బాట పట్టాయి. ఇందులో హెచ్సీఎల్ టెక్ అత్యధికంగా 4 శాతం లాభపడింది. ఇక మరోవైపు అత్యధికంగా నష్టపోయిన వాటిలో సిప్లా, టైటాన్ కంపెనీ, అదని పోర్ట్స్, దివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా కంపెనీలు సంబంధించిన షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఇందులో అత్యధికంగా సిప్లా మూడు శాతం పైన నష్టపోయింది.
ఇక నేడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర విషయానికి వస్తే.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలు నష్టపోయి 53090 వద్ద ముగిసింది. అలాగే 22 గ్రాములు 10 గ్రాముల బంగారం కూడా 220 రూపాయలు నష్టపోయి 48 650 వద్ద ముగిసింది. ఇక మరోవైపు బంగారం తో పాటు వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి మీద 1200  రూపాయలు తగ్గి ru  62 600 వద్ద ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: