లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

Suma Kallamadi
గత వారం భారీ లాభాలలో కొనసాగిన దేశీ స్టాక్ మార్కెట్స్ నేడు కూడా లాభాల్లోనే కొనసాగింది. నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 84 పాయింట్లు బలపడి 40593 పాయింట్ల వద్ద ముగియగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 16 పాయింట్లు బలపడి 11930 వద్ద ముగిసింది. అలాగే అంతర్జాతీయంగా అమెరికా డాలర్ తో భారత రూపాయి మారకం విలువ 12 పైసలు బలపడి 73. 27 వద్ద ముగిసింది.
ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ లో బ్యాంకు షేర్లు డీలా పడడంతో మార్కెట్ కాస్త ఊగిసలాడినట్లుగా కనబడింది. ఇక నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 332 రూపాయలు పెరిగి చివరకు 51 149 రూపాయల వద్ద ముగిసింది. ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో అత్యధికంగా లాభం, నష్టం పొందిన షేర్ల వివరాలు ఓసారి చూద్దాం. ముందుగా అత్యధికంగా లాభపడిన కంపెనీ షేర్ల విషయానికి వస్తే... ఐటిసి, విప్రో, యూపీఐ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అత్యధికంగా లాభపడిన లిస్టులో ముందుగా ఉన్నాయి. ఇక ఇందులో ఐటిసి కంపెనీ షేర్ల విలువ 2.59 శాతం లాభపడింది.

ఇక మరోవైపు అత్యధికంగా షేర్ మార్కెట్ లో నష్టపోయిన వాటి వివరాలు చూస్తే ముందుగా భారతి ఎయిర్ టెల్, జెఎస్డబ్ల్యు స్టీల్, టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇందులో భారతి ఎయిర్ టెల్ అత్యధికంగా 2.39 శాతం నష్టపోయింది. నేడు నిఫ్టీ సెక్టోరల్ లో నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ పిఎస్ సిలు నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర కొద్దిమేర తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: