లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్...!

Suma Kallamadi
గత మూడు రోజుల నుంచి లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్స్ నేడు కూడా లాభాల వైపు దూసుకు వెళ్ళాయి. మొదట కాస్త ఊగిసలాటకు లోనైనా స్టాక్ మార్కెట్స్ ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా లాభాల వైపు పయనించాయి. ఇక నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 34 పాయింట్లు బలపడి 39879 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపున నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 76 పాయింట్లు బలపడి 11739 వద్ద ముగిసింది. నిన్నటి రోజున అమెరికా మార్కెట్లకు కాస్త నష్టాలలో ట్రేడ్ అవ్వగా నేడు మార్కెట్లో ఓపెనింగ్ సమయంలో కాస్త ఒడిదుడుకులకు లోనయింది.

ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 లో లాభాలు, నష్టాలు పొందిన కంపెనీ షేర్ల విషయానికి వస్తే ముందుగా అత్యధికంగా కంపెనీల్లో టైటాన్, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్, మారుతి సుజుకి, రిలయన్స్ కంపెనీలు అత్యధిక  లాభాలు స్వీకరించిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇక మరోవైపు బజాజ్ ఫైనాన్స్, బిపిసిఎల్, టాటా మోటార్స్, హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్ కంపెనీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. టైటాన్ కంపెనీ అత్యధికంగా 4.5 శాతం లాభపడింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కంపెనీ షేర్ 4.1 శాతం నష్టపోయింది.

ఇక నగదు విషయంలో చూస్తే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు 1102 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, 930 కోట్ల విలువైన షేర్లను దేశీ ఫండ్స్‌(డీఐఐలు) విక్రయించారు. ఇక నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరల విషయానికొస్తే... 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 440 రూపాయలు నష్టపోయి 52410 వద్ద ముగిసింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు నష్టపోయి 48050 వద్ద ముగిసింది. అలాగే ఒక కిలో వెండి ధర 1800 రూపాయలు నష్టపోయి 60200 వద్ద ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: